వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నాది బాధ్యత, కోహినూర్ మాదే': కీలక ఒప్పందాలు.. తొలి రోజే రూ.4.25 లక్షల కోట్లు

ఏపీలో పెట్టుబడులు పెడితే లాభాలు సాధించి పెడతాయని తాను హామీ ఇస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు శుక్రవారం హామీ ఇచ్చారు. విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలో పెట్టుబడులు పెడితే లాభాలు సాధించి పెడతాయని తాను హామీ ఇస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు శుక్రవారం హామీ ఇచ్చారు. విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.

<strong>మేం ఫస్ట్, అమరావతికి రండి: చంద్రబాబు, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలపై.. </strong>మేం ఫస్ట్, అమరావతికి రండి: చంద్రబాబు, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలపై..

రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని కుటుంబాలు వృద్ధి సాధించాలనేదే తన తపన అన్నారు. ప్రతి కుటుంబం రూ.10వేల వరకు సంపాదించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

chandrababu naidu

గతేడాది అన్ని రాష్ట్రాలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాయని, ఏపీ వృద్ధి రేటు మాత్రం డబుల్ డిజిట్ సాధించిందన్నారు. అక్వా ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానం సంపాదించామన్నారు. పారిశ్రామికవేత్తలు పూర్తి నమ్మకంతో పెట్టుబడి పెట్టవచ్చన్నారు.

కోహినూర్ మాదే

అమరావతి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాదులకు మెరుగైన వసతుల సదుపాయం అన్నారు. ప్రఖ్యాత కోహినూర్ వజ్రం అనంతపురం గనుల నుంచి వచ్చిందని చెప్పారు. విలువైన ఖనిజ వనరుల నిలయం ఏపీ అన్నారు. ఈ ఏడాది రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాలనేది తమ లక్ష్యమని చెప్పారు.

రెండు కీలక ఒప్పందాలు

తొలి రోజు రెండు కీలక ఒప్పందాలు జరిగాయి. హెచ్‌పీసీఎల్, గెయిల్ రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఓఎన్జీసీ రూ.78 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తంగా ఈ ఇంధన కంపెనీలు రూ.1.28 లక్షల కోట్లు పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కాగా, ఈ సమ్మిట్‌కు 50 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు వచ్చారు.

తొలిరోజు సీఐఐ సమ్మిట్ ముగిసేసరికి రూ.4.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 128 ఎంవోయులు కుదిరాయి. వీటి ద్వారా 5.50 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఐటీలో 68 ఎంవోయులు కుదిరాయి.

ఏపీది తొలి స్థానం, అక్కడా ఇక్కడా పని రాక్షసులే: బాబుపై వెంకయ్య, జైట్లీఏపీది తొలి స్థానం, అక్కడా ఇక్కడా పని రాక్షసులే: బాబుపై వెంకయ్య, జైట్లీ

కుప్పంలో బంగారు గనుల తవ్వకానికి ఆస్ట్రేలియా కాన్సులేట్‌తో ఒప్పందం

కుప్పంలో బంగారు గనుల తవ్వకానికి ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్‌తో ఒప్పందం కుదిరింది. రూ.3000 కోట్ల పెట్టుబడులు ఆస్ట్రేలియా పెట్టనుంది. మదనపల్లెలో ఇనుపగనుల తవ్వకానికి ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది.

చంద్రబాబుకు జైట్లీ ప్రశంస

విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలనన్నింటిని అమలు చేస్తామని, అదనంగా మరింత సహకారం అందిస్తామని అంతకుముందు జైట్లీ చెప్పారు. ఇప్పటికే పలు కేంద్ర సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాదులో కేంద్రీకృతమైన పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

ఐటీ హబ్‌గా ఏపీ: గ్రంథి

భవిష్యత్‌లో ఏపీ ఐటీ హబ్‌గా మారుతుందని జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లిఖార్జున రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

<strong>అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!</strong>అక్కడే దొరికిపోయారు, అదే చిక్కు తెచ్చింది: మహేష్ బాబు మౌనం వెనుక!

అమరావతిలో మౌలిక వసతులు పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అమరావతిని మినీ సింగపూర్‌గా మారుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణను చంద్రబాబు ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు. కాకినాడ సెజ్‌ అతిపెద్ద పారిశ్రామిక హబ్‌గా మారుతుందన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహకరంగా లేదు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహకరంగా లేదని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్మలా సీతారామన్ అన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో దూరదృష్టి కలిగిన నేతలు ఉన్నారని, దూరదృష్టి కలిగిన నేతల నాయకత్వంలో భారత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని, జీడీపీ ర్యాకింగ్‌లో ఏపీ చాలా తక్కువ సమయంలోనే మెరుగైన స్థానంలో నిలిచిందని, పెట్రో ఉత్పత్తుల్లో ఏపీ దేశానికి చాలా కీలకంగా మారుతుందని, చంద్రబాబు ముందుచూపు ఉన్న నేత అని, ప్రపంచంలో చాలా దేశాల్లో అస్థిరత నెలకొని ఉందని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ సంస్థలను ఆహ్వానిస్తున్నానని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన అన్నారు.

English summary
AP CM Chandrababu Naidu lists demonetisation, GST among big ticket reforms powering changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X