పులివర్తి నానిపై దాడి ఘటనపై భగ్గుమన్న చంద్రబాబు, లోకేష్.. ఏమన్నారంటే
తిరుపతిలో చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనపై, అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు .
తిరుపతిలో పులివర్తి నానిపై దాడిపై చంద్రబాబు ఫైర్
ఈ పోస్టులో చంద్రబాబు ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు అంటూ మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని ప్రశ్నించారు. తిరుపతిలో నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు… pic.twitter.com/4H5im5dMrc
— N Chandrababu Naidu (@ncbn) May 14, 2024
భద్రత కల్పించటంలో పోలీసులు విఫలం
పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో... ప్రజలకు, ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అవుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.మరోవైపు మాచర్లలో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలోను దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ చంద్రబాబు పోస్ట్ పెట్టారు.
ఓటమి భయంతోనే దాడులు: నారా లోకేష్
పులివర్తి నానిపై దాడి ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన ఓడిపోతున్నామన్న భయంతోనే వైసిపి మూకలు దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్న ఆయన, అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపిందని విరుచుకుపడ్డారు.
చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్పదనే సంకేతాలతో
— Lokesh Nara (@naralokesh) May 14, 2024
వైకాపా తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన… pic.twitter.com/l6DeM2OgMs
దిగ్భ్రాంతికి గురయ్యాను.. కఠిన చర్యలు తీసుకోండి
పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు . నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications