చంద్రబాబు, లోకేష్.. టీడీపీ కూటమి విక్టరీతో నారా వారింట సంబరాలు, భువనేశ్వరి, బ్రాహ్మణి హ్యాపీ!!
AP assembly election Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో ఏపీ ఓటర్లు ఫ్యాను రెక్కలు విరగ్గొట్టారు. చంద్రబాబు సైకిల్ కు పట్టం కట్టారు. ఏపీ ఎన్నికల ఫలితాలలో టిడిపి కూటమి హవా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాలలో కూటమి విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ టిడిపి కూటమి అభ్యర్థులు విజయాలను నమోదు చేస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభంజనం
ఇప్పటివరకు వందమంది కూటమి సభ్యులు విజయం సాధించగా, మరో 30 పైగా టిడిపి కూటమి సభ్యులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి పార్టీల విజయం ఫైనల్ కావడంతో వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభంజనం సృష్టించిందని టిడిపి వెల్లడిస్తోంది.రాష్ట్రంలోని అన్ని టీడీపీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు వేడుకలకు శ్రీకారం చుట్టారు.

చంద్రబాబు నివాసంలో నారా వారి ఫ్యామిలీ సెలబ్రేషన్స్
కుప్పంలో చంద్రబాబు విజయం సాధించగా, అటు మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో నారా లోకేష్ చారిత్రాత్మక విజయం నమోదయిందని తెలుగుదేశం పార్టీ సభ్యులతో పాటు, నారా వారి కుటుంబ సభ్యులు సైతం సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవాలను చంద్రబాబు తన నివాసంలో తన కుటుంబ సభ్యులు, బంధువులందరి సమక్షంలో జరుపుకున్నారు .

ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభంజనం. అటు మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి చారిత్రాత్మక విజయం. ఈ విజయోత్సవాలను చంద్రబాబుగారు కుటుంబ సభ్యులు, బంధువులందరి సమక్షంలో జరుపుకున్నారు . మనవడు నారా… pic.twitter.com/Su7ptDyxnM
— Telugu Desam Party (@JaiTDP) June 4, 2024
నారా వారింట సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్
మనవడు నారా దేవాన్ష్ కేక్ కట్ చేసి అందరికి తినిపించగా... అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. నారా లోకేష్ తన కుమారుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఫలితాలలో విజయం సాధించిన సందర్భంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో, తల్లిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఫుల్ హ్యాపీ
ఇక విక్టరీ సింబల్ చూపిస్తూ చంద్రబాబు నారా భువనేశ్వరి, భర్త లోకేష్ విజయంతో సంతోషంలో నారా బ్రాహ్మణి, కుటుంబ సభ్యులు చేసుకున్న సంబరాలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 175 సీట్లకు పోటీ చేసిన వైసీపీ ప్రస్తుతం 12 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉండగా, ఏపీలో క్లీన్ స్వీప్ చేసిందని రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలలో మునిగి తేలుతున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications