చిన్నారితో జగన్: సవతి కాంగ్రెస్సని బాబుపై..(పిక్చర్స్)
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకర్గ కేంద్రంలోని ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద వైయస్సార్ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినా.. చంద్రబాబు వల్లే ప్రభుత్వం నిలబడిందని ఆరోపించారు. పిల్ల కాంగ్రెస్ అని చంద్రబాబు తమ పార్టీని అనడం కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకూ కాపాడుతూ వచ్చిన చంద్రబాబుది సవతి కాంగ్రెస్సా అని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంతో చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ఆరోపించారు.
పార్వతీపురం స్థానం నుంచి తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జమ్మాన ప్రసన్న కుమార్‌ను జగన్ ప్రకటించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

జగన్ ప్రసంగం
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకర్గ కేంద్రంలోని ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద వైయస్సార్ కూడలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు.

భారీగా హాజరైన జనం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

జగన్ అభివాదం
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినా.. చంద్రబాబు వల్లే ప్రభుత్వం నిలబడిందని ఆరోపించారు.

ఓదారుస్తూ..
విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకర్గ కేంద్రంలోని ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద వైయస్సార్ కూడలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ వృద్ధురాలిని ఓదారుస్తున్న జగన్.

జగన్ పలకరింపు..
విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో పర్యటించిన సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

చిన్నారితో..
విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో పర్యటించిన సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications