అమరావతిలో యూఏఈ భారీ పెట్టుబడులు.. దటీజ్ చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో పెట్టుబడులు తీసుకురావటానికి చంద్రబాబుతో పాటు మంత్రులు తీవ్రంగా కష్టపడుతున్నారు. పారిశ్రామికంగా ఏపీని అభివృద్ధి చేస్తేనే సంపద సృష్టి జరుగుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో గత వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టబోమని వెనక్కు వెళ్ళిన యూఏఈ ఇప్పుడు చంద్రబాబు హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో కీలక అడుగు పడింది.
యూఏఈ - ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడలోని ఓ హోటల్‌లో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యూఏఈ - ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూఏఈ అంబాసిడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ అల్‌షాలీ, ఏపీతో పాటు దుబాయ్ వ్యాపార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి టి.జి భరత్ వారితో చర్చించారు.

ఏపీలో పెట్టాలనుకున్న ప్రాజెక్ట్ లపై చర్చ
యూఏఈ అంబాసడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ అల్‌షాలీ మాట్లాడుతూ ఏపీలో పెట్టాలనుకున్న ప్రాజెక్టులు గత ఐదేళ్లలో పక్కకు వెళ్లాయన్నారు. మొదటగా ఈ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. త్వరిత గతిన వీటిని ట్రాక్ పెట్టేందుకు పని చెయ్యాలన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం
అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. యూఏఈ నుండి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. గడిచిన ఐదేళ్లలో లులూతో పాటు పలు కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయాయని చెప్పారు. తమ ప్రభుత్వంలో యూఏఈ నుండి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామన్నారు.

యూఏఈ పెట్టుబడులపై మంత్రి టీజీ భరత్
గతంలో యూఏఈ పెట్టుబడిదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే దిశలో ముందుకు వెళతామన్నారు. అప్పుడే మరికొందరు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారని, ముందుకు వస్తారని మంత్రి టీ జీ భరత్ పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లో నమ్మకం కలిగిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. యూఏఈ వ్యాపార ప్రతినిధులు పలు ప్రజెంటేషన్లు ఇచ్చారని, త్వరలో వీరి ప్రాజెక్ట్ లను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి టి.జి భరత్ తెలిపారు.

అమరావతిలో పెట్టుబడులకు యూఏఈ ఇప్పటికే చర్చలు
అయితే నెలరోజుల క్రితం యూఏఈకి చెందిన M42 కంపెనీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం మూడు ఎకనామిక్ కారిడార్లలో పెట్టుబడులు, 9 మునిసిపాలిటీలలో హెల్త్ హబ్స్ నిర్మాణం, అమరావతి హెల్త్ సిటీ లో పెట్టుబడులకు అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక తాజాగా పరిశ్రమల శాఖా మంత్రితో భేటీలోనూ పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. చంద్రబాబు సీఎం కావటంతోనే మళ్ళీ ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. దటీజ్ చంద్రబాబు అంటున్నారు ఈ వార్తలు విన్న బాబు ఫ్యాన్స్.












Click it and Unblock the Notifications