మోడీకి ఫిదా: ఎన్‌డిఎ కన్వీనర్‌గా చంద్రబాబు?

హైదరాబాద్: బిజెపి తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు కనిపిస్తోంది. పొత్తు తర్వాత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియమితులయ్యే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో బిజెపితో కలిసే ప్రయాణం ఉంటుందని చంద్రబాబు శుక్రవారం తెలుగుదేశం శానససభా పక్షం (టిడిఎల్‌పి) కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. తాను ఎన్‌డిఎ కన్వీనర్‌గా నియమతులయ్యే అవకాశాలున్నట్లు కూడా ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు.

నరేంద్ర మోదీవస్తే బాగుంటుందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా బలపడుతోందని, బిజెపి కన్నా కూడా నరేంద్ర మోడీ ఇమేజీ ఎక్కువగా ఉందని, మంచి పాలన ఇచ్చిన మోడీ, మనం కలిసి ప్రయాణిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారని ఆయన శాసనసభ్యులతో అన్నట్లు తెలుస్తోంది.

Chandrababu

తృతీయ ఫ్రంట్ పట్ల ఆయన నిరాసక్తత వ్యక్తం చేశారు. తృతీయ ఫ్రంట్ గురించి కొందరు మాట్లాడుతున్నా ఇంత చివరి దశలో దాన్ని బలోపేతం చేయడం కష్టమనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్‌డిఎ కన్వీనర్‌గా పనిచేశారు. మరోసారి ఆ పాత్రను పోషించడానికి సిద్ధపడుతున్నట్లు ఆయన మాటల ద్వారానే తెలిసి వస్తోంది.

అప్పట్లో బిజెపితో 13 పార్టీలుండేవని, ఇప్పుడు రెండే ఉన్నాయని, దేశవ్యాప్తంగా చాలా పార్టీలను కూడగట్టాల్సిన అవసరం బిజెపికి ఉందని. ఈ దిశగా బిజెపి గట్టి ప్రయత్నం చేస్తున్న అన్నీ ఆ పార్టీ నేతలే చేయలేరని ఆయన అన్నారు. అన్ని పార్టీలతో మంచి సంబంధాలున్న మన వంటివారి అవసరం ఆ పార్టీకి ఉందని ఆయన చెప్పారు. దాంతో ఎన్‌డిఎ కన్వీనర్‌గా మరిన్ని పార్టీలను బిజెపి వైపు తిప్పేందుకు కూడా చంద్రబాబు తన పాత్ర పోషించేందుకు సిద్ధపడ్డారని ఆ మాటలను బట్టి అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+