గుజరాత్ కన్నా మేమే దగ్గర: ఏపీపై చైనా ఆసక్తి, బాబు బిజీ(పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. గోదావరి పుష్కర పనుల పైన సమీక్ష నిర్వహించారు. చైనా సంస్థ బృందంతో భేటీ అ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి అధికారులతో భేటీ నిర్వహించారు.
పట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కరువురహితంగా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పోలవరం మెయిన్ కుడికాల్వ పనులు పరిశీలించారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పోలవరం మెయిన్ కుడికాల్వ పనులు పరిశీలించారు.

చంద్రబాబు
పల్లంట్ల నుండి లక్ష్మీపురం వెళ్లే కాల్వ గట్టుల వెంబడి ప్రయాణించి కాల్వ పనులు పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు
పనులు మందకోడిగా సాగడం పైన, ఎక్కువ ప్రొక్లెయినర్లు పెట్టి పనులు వేగవంతం చేయాలని చెప్పినప్పటికీ చేయక పోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు
అంతకుముందు దేవరపల్లి జిల్లా ప్రజాపరిషత్తు ఉన్నత పాఠశాల హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది.

చంద్రబాబు
మంత్రి పీదల సుజాత, ఎంపీ మురళీ మోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు
మరోవైపు, పుష్కరాలపై సమీక్షించారు. మీకు నిధులు ఇచ్చాను.. అధికారాలు ఇచ్చాను... అయినా అనుకున్నంత స్థాయిలో పనులు, ఏర్పాట్లు జరగలేదని చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు.

చంద్రబాబు
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పనుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు
గురువారం ఉదయం రాజమండ్రిలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

చంద్రబాబు
నిధులిచ్చి, ప్రణాళిక ఇచ్చినాగానీ ఫలితాలను సాధించటంలో అధికారులు విఫలమయ్యారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు
హుధుద్ తుపాను సంభవించినపుడు, తుపాను తీరం దాటకుండానే ప్రజలను అప్రమత్తం చేసి, ప్రాణాలను కాపాడటంతో పాటు, అనంతర పరిణామాల్లో కూడా వారం రోజుల్లో సాధారణ పరిస్థితులను ఉత్తరాంధ్రలో తీసుకురాగలిగామన్నారు. గోదావరి పుష్కరాలను కూడా అదే సమన్వయంతో విజయవంతం చేస్తామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు.
కాగా, ఏపీ మరో మూడు ఓడరేవులను అభివృద్ధి చేయనుంది. ఏపీ భౌగోళికంగా దక్షిణాసియా దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలకు అనువుగా ఉంటుందని ఏపీ అధికారులు చెప్పారు. చైనాకు చెందిన దలియన్ వాండా గ్రూపునకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం గురువారం విజయవాడకు వచ్చింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వసతులు, పెట్టుబడుల అవకాశాలను ఏపీ అధికారులు వివరించారు. దక్షిణాసియా దేశాలతో వ్యాపారానికి చైనాకు ఏపీ అనువైన కేంద్రమని, వాణిజ్య పరికరాలు, సరుకును గుజరాత్ రాష్ట్రం కంటే ఆరు రోజుల ముందుగా ఇక్కడి తీరానికి చేర్చవచ్చునన్నారు.
కాగా, అమరావతిలో బహుళ అంతస్థుల భవనాలు, పోర్టుల నిర్మాణానికి చైనా ఆసక్తి చూపుతోంది. చైనాకు చెందిన డాలియన్ వాండా గ్రూప్ రాజధానిలో బహుళ అంతస్థుల భవనాలు, పోర్టుల నిర్మాణానికి ఈ సస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications