ఏపీలో ఎలా?: చంద్రబాబుతో రతన్ టాటా భేటీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా శనివారం భేటీ అయ్యారు. శనివారం ఉదయం చంద్రబాబు రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాదుకు వచ్చారు.
నేరుగా నోవాటెల్ హోటల్ వెళ్లి సాయంత్రం వరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఉండగానే చంద్రబాబుకు మనవడు పుట్టినట్లు సమాచారం వచ్చింది. సమావేశం ముగియగానే చంద్రబాబు సాయంత్రం అయిదు గంటల సమయంలో ఆసుపత్రికి వెళ్లారు.

కాగా, రతన్ టాటాతో భేటీలో చంద్రబాబు పలు వ్యాపార విషయాలు మాట్లాడారని సమాచారం. ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి పైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications
