కేబినెట్లో ప్రస్తుతానికి ఒక్కటే: బాబుతో మోడీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరికే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఒక్క పదవితో సరిపెట్టినా త్వరలో విస్తరణ చేస్తామని, అప్పుడు మరో రెండు మూడు పదవులు ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
నరేంద్ర మోడీ రేపు (సోమవారం) ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
టిడిపి నుండి ఒక్కరికే అవకాశం ఉండటంతో పార్టీ సీనియర్ అశోక గజపతి రాజు రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సికింద్రాబాద్ బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయకు కూడా ఛాన్స్ ఉంది.

చంద్రబాబు, మోడీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలోని గుజరాత్ భవన్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

చంద్రబాబు, మోడీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలోని గుజరాత్ భవన్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీకి చంద్రబాబు శాలువా కప్పారు.

చంద్రబాబు, మోడీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలోని గుజరాత్ భవన్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీకి చంద్రబాబు శాలువా కప్పి అభినందనలు తెలుపుతూ...

చంద్రబాబు, మోడీ
ఈ భేటీలో తెలుగుదేశం పార్టీకి కేంద్ర కేబినెట్లో... ప్రస్తుతానికి ఒక్కరికి అవకాశం ఇస్తామని కాబోయే ప్రధాని మోడీ.. చంద్రబాబుకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు, మోడీ
టిడిపి నుండి ప్రస్తుతానికి ఒక్కరికి అవకాశం ఇవ్వడంతో ఆ పార్టీ నుండి అశోక గజపతి రాజుకు రేపు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మరిన్ని పదవులు వస్తాయని చంద్రబాబు పార్టీ ఎంపీలకు చెప్పారు.












Click it and Unblock the Notifications