వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎంవోలో ఎందుకు దాక్కున్నారు?: చంద్రబాబు, జైట్లీ, గడ్కరీలకు లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

జైట్లీ, గడ్కరీలకు చంద్రబాబు లేఖ

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

విజయసాయి రెడ్డి పిఎంవోలో చేసిందేమిటి, మీడియా కంటపడకుండా ఎందుకు దాక్కున్నారని ఆయన ప్రశ్నంచారు. మీలాగా లాలూచీ రాజకీయాలు తనకు తెలియవని ఆయన అన్నారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

మీకు అవసరం నాకు కాదు

మీకు అవసరం నాకు కాదు

కేసుల మాఫీ అవసరం మీకు ఉంది గానీ మాకు లేదని చంద్రబాబు వైసిపిని ఉద్దేశించి అన్నారు. శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పిఎంవో చుట్టూ విజయసాయి రెడ్డి చేస్తున్న ప్రదక్షిణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సుజనా చౌదరిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నిన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్నాం

నిన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్నాం

నిన్నటి దాకా బిజెపికి మిత్రపక్షంగా ఉన్నామని, అయినా కేంద్రం న్యాయం చేయలేదని, అందుకే విభేదించి బయటకు వచ్చామని, ప్రజల తరఫున పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలను బలహనపరచరాదని ఆయన అన్నారు.

ఇంకా రెండు రోజులే సభ

ఇంకా రెండు రోజులే సభ

ఇంకా రెండు రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని, ఆ స్థితిలో మన పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన తమ పార్టీ ఎంపీలకు సూచించారు. ఎంపీలతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎపి ప్రయోజానాలు కాపాడాలని, ప్రజల హక్కులను పరిరక్షించాలని ఆయన అన్నారు. సభ లేనప్పుడు ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాలని ఆయన సూచించారు.

కేంద్ర మంత్రులకు బిజెపి లేఖలు...

కేంద్ర మంత్రులకు బిజెపి లేఖలు...

సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఆమోదించాలని కోరుతూ చంద్రబబు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీకి, నితిన్ గడ్కరీకి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. సవరించిన అంచనాను ఆయన రూ.58,319.06 కోట్లుగా చూపించారు. పోలవరం పాత డిపీఆర్ రూ.16010.45 కట్లకు సంబంధించిన నిధుల వ్యం పూర్తయిందని, అందువల్ల భూసేకరణ సహాయ, పునరావాస కార్యక్రమాలు, హెడ్ వర్క్స్ పనుల కోసం కొత్త డిపీఆర్‌ను అమోదించాలని ఆయన కేంద్ర మంత్రులను కోరనున్నారు. సోమవారంనాటికీ కొత్త డీపీఆర్‌ను కేంద్రానికి పంపించనున్నారు.

English summary
Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chnadrababu Naidu accused YSR Congress MP Vijayasa Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X