అమిత్ షాకు చంద్రబాబు ఫోన్, ఎందుకంటే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫోన్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో బీజేపీ గెలుపుపై ఆయనకు అభినందనలు తెలిపారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫోన్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Recommended Video

బాబుకు వీర్రాజు ఊహించని షాక్! 2014లో చంద్రబాబు గెలిచేవారా ?
ఈ నేపథ్యంలో అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే పలు రాజకీయాంశాలపైనా ఆయనతో మాట్లాడినట్టు సమాచారం. సోమవారం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.

సోమవారం బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలియగానే చంద్రబాబునాయుడు ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. మంగళవారం అమిత్ షాకు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.
అమిత్ షాతో చంద్రబాబునాయుడు దాదాపు 15 నిమిషాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పలు రాజకీయాంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications