బిజెపికి ఓటు: బాధ ఉందని బాబు, బ్రహ్మానందంకి నిరాశ

హైదరాబాద్: సైకిల్ గుర్తుకు ఓటేయనందుకు తనకు చాలా బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. జూబ్లీహిల్స్‌లోని గాయత్రి హిల్స్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడారు. సైకిల్ గుర్తుకు ఓటేయనందుకు బాధగా ఉందని చెప్పారు. టిడిపి, బిజెపి పొత్తు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. అందరికీ సమన్యాయం... ఇదే తెలుగుదేశం పార్టీ విధానం అన్నారు. జాతి, దేశ అవసరాల దృష్ట్యా టిడిపి, బిజెపి కలిశాయని చెప్పారు.

Chandrababu Naidu cast his vote

ఈ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోని ప్రజల భద్రతకు దర్పణం పడతాయన్నారు. కాంగ్రెసు హయాంలో జరిగి అవినీతి, అక్రమాల పైన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తాను పొత్తు ధర్మంలో భాగంగా తమతో పొత్తు పెట్టుకున్న బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసినట్లు చెప్పారు.

బ్రహ్మానందం దంపతుల ఓటు గల్లంతు

ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం ఓటు గల్లంతయింది. బ్రహ్మానందంతో పాటు ఆయన సతీమణి ఓటు కూడా గల్లంతయింది. దీనిపై బ్రహ్మానందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర నిరాశతో ఆయన వెనుదిరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+