2014 భయంకరం: తుళ్లూరులో బాబు 'కొత్త' వేడుక
గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు తర్వాత విశాఖపట్నమే పెద్ద నగరమని, అయినప్పటికీ తుళ్లూరు తప్ప మరే ప్రాంతం అనువుగా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తనకు స్వార్థమే ఉంటే తిరుపతిలో తమ ఇంటి ముందే పదివేల ఎకరాల అటవీ భూమి ఉందని, అక్కడే రాజధానిని నిర్మించేవాడినని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం పర్యటించారు. రాజధాని ప్రకటన తర్వాత తొలి పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబుకు తుళ్లూరు రైతులు వెండి కిరీటాన్ని బహూకరించారు. అనంతరం గ్రామస్థుల మధ్య చంద్రబాబు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రాజధానిలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాజధాని ప్రాంత రైతులను భయభ్రాంతులకు గురి చేసే వారిని క్షమించేదిలేదని హెచ్చరించారు. రైతులకు ఆదాయమార్గాలను కూడా చూపిస్తామన్నారు. గ్రామ కంఠానికి పట్టాలు ఇస్తామని, గ్రామస్తులు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పారు. నేను మీ దగ్గరే ఉంటానని, మీ బాగోగులు చూసుకుంటానని చెప్పారు.

ఇరిగేషన్ కార్యాలయం వేడుకల్లో...
ఆరు నెలల పాలనను విజయవంతంగా పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. ఉదయం విజయవాడలోని ఇరిగేషన్ కార్యాయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త సంవత్సరం సందర్భంగా పోలవరంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ పర్యటించాలనుకుంటున్నట్లు చెప్పారు. 2014 ఏపీకి ఒక భయంకరమైన సంవత్సరమన్నారు.
హుధుద్ తుపానును సమర్థంగా ఎదుర్కోగలిగామని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ని ప్రజలు ఎన్నికల్లో మట్టికరిపించారన్నారు. విభజనలో అప్పు జనాభా ప్రాతిపదికన పంచి ఆదాయం మాత్రం అలా పంచలేదన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు.
18న స్మార్ట్ ఏపీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో అందరినీ భాగస్వాములను చేస్తామని, దీనిపై ప్రతిచోట చర్చ జరగాలన్నారు. ప్రతి గ్రామం స్మార్ట్ గ్రామంగా కావాలని ఆకాంక్షించారు. 20 అంశాలతో స్మార్ట్ గ్రామ నిర్మాణం చేపడతామన్నారు. స్మార్ట్ ఏపీ కోసం పోర్టల్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, మంచినీటి కనెక్షన్ ఉండేలా చూస్తామన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
క్యూలైన్ నిర్వహణలో ఇకపై.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications