వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం ఫస్ట్, అమరావతికి రండి: చంద్రబాబు, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలపై..

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సీఐఐ సమ్మిట్‌లో చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం సీఐఐ సమ్మిట్‌లో చెప్పారు. అమరావతిలో భాగస్వాములు కావాలన్నారు.

దేశంలో విశాఖ ఉత్తమమైన నగరం అన్నారు. రాబోయే రోజుల్లో దీనిని ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భవిష్యత్తులో మానవ మానవ వనరుల్లో భారత్‌కు పోటీ ఉండదని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

<strong>జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!</strong>జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!

జీఎస్టీ వల్ల దేశంలో ఒకే పన్ను విధానం వస్తోందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఐటీ రంగంలో మనం బలంగా ఉన్నామని చెప్పారు. ఆధార్ అనుసంధానం ద్వారా వేలిముద్రలతో లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు.

Chandrababu Naidu in CII summit

ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఆఫ్ ఎకానమీ అన్నారు. దానిని నిర్మించామన్నారు. ఈ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో యాభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని చెప్పారు.

టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు రావన్నది అవాస్తవం

పెద్ద నోట్ల రద్దుకు ప్రజలు సహకరించారని చెప్పారు. నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా భవిష్యత్తు కోసం సహకరించారన్నారు. ఏపీలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు రావన్నది అవాస్తవమని చెప్పారు.

Chandrababu Naidu in CII summit

అమరావతిలో భాగస్వాములు కండి

రాజధాని అమరావతి కోసం రైతులు 35 వేల ఎకరాలను స్వచ్చంధంగా ఇచ్చారని చంద్రహబాబు చెప్పారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యానికి ముందుకు రావాలన్నారు. అమరావతిని హరిత నగరంగా నిర్మిస్తామన్నారు.

గత ఏడాది పెట్టుబడులు

గత ఏడాది పెట్టటుబడుల సమ్మిట్‌లో 927 ఎంవోయులు కుదిరాయని చెప్పారు. అందులో 659 ఎంవోయులను ఆమోదించామని చెప్పారు. గత ఏడాది 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu in CII summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X