ఈగో వద్దు, బాగోతం బయటకు: చంద్రబాబు క్లాస్, తెలంగాణలో ఉంటున్నవాళ్లు కూడా..
ఏపీలో వైద్య, విద్యా రంగాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అధిక నిధులు కేటాయిస్తున్నా, అనుకున్న విధంగా ఫలితాలను రాబట్టడంలో విఫలమవుతున్నారంటూ మంత్రులు, అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చే
అమరావతి: ఏపీలో వైద్య, విద్యా రంగాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అధిక నిధులు కేటాయిస్తున్నా, అనుకున్న విధంగా ఫలితాలను రాబట్టడంలో విఫలమవుతున్నారంటూ మంత్రులు, అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, పట్టణాభివృద్ధి, పురపాలన, టెక్నికల్ స్కిల్స్ అంశాలపై చర్చ జరుగగా, విద్యాశాఖ అధికారుల వైఖరిపై చంద్రబాబు మండిపడ్డారు. బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్నారు.

అహంభావం వీడండి
అహంభావాన్ని వీడి సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయనను అడ్డుకున్న చంద్రబాబు, ఎన్నిసార్లు చెప్పినా విద్యా శాఖ సరిగ్గా పని చేయడం లేదన్నారు.

బాగోతం బయటపడుతున్నా చర్యలేవి
లంచాలు తీసుకుంటున్న అధికారుల బాగోతాలు బయటపడుతున్నా, చర్యలు చేపట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లంచగొండులపై నిర్మొహమాటంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు సైతం తమ అహంకారాన్ని, ఇగోలను పక్కనబెట్టి, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.

వారి ఆటలు సాగనివ్వొద్దు
మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వగానే కాపుల రిజర్వేషన్ పైన నిర్ణయం తీసుకుంటామని, అయినా ప్రజల్లో గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, మరికొందరు రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అటువంటి వారి ఆటలు సాగనివ్వవద్దన్నారు.

తెలంగాణలో ఉంటున్న కంచ ఐలయేయ
రాష్ట్రంలో కులాల విషయంలోనూ, పరిశ్రమలకు వ్యతిరేకంగానూ జరిపే నిరసనలపై పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. రాష్ట్రంలో ఉన్న వ్యక్తులతోపాటు తెలంగాణలో ఉంటున్న కంచ ఐలయ్య వైశ్యుల మనోభావాలు గాయపడేలా, మందకృష్ణను ఉద్దేశిస్తూ.. మరొకాయన ఇక్కడ సభలతో జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని అడ్డుకోకుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండదని చంద్రబాబు అన్నారు.

కలెక్టర్ పైన అసహనం
తుందుర్రులో పైపులైను వేస్తే ఎలాంటి సమస్యా ఉండబోదని ఏడాది క్రితమే తాను చెప్పినా ఇప్పటి వరకూ కనీసం టెండర్లు పిలవకపోవడం ఏంటని పశ్చిమ గోదావరి కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications