జగన్‌ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్‌కు, జైల్లో ఉండి..: బాబు, ముప్పేటదాడి
జిల్లా కలెక్టర్‌ను సెంట్రల్ జైలుకు పంపిస్తామన్న వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు స్పందించారు.
విజయవాడ: జిల్లా కలెక్టర్‌ను సెంట్రల్ జైలుకు పంపిస్తామన్న వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు స్పందించారు.

జగన్‍ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్‌కు
జిల్లా కలెక్టర్‌ను జైలుకు పంపిస్తానని జగన్ అనడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత ఎక్కువ సమయం జైలులో ఉన్నందునే అలా అంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సెంట్రల్ జైల్లో ఉన్న అవినీతిపరులు కలెక్టర్‌ను తిడతారా అన్నారు. జగన్‌ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్‌కు ఉందని దుయ్యబట్టారు.

చెడగొట్టే ప్రయత్నం
కొండవీడు వాగు మీద ఇచ్చిన హామీని తాము నెరవేర్చుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొందరు అభివృద్ధిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన గడ్డ మీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. పోలవరం పూర్తయితే నీటి కరువు ఉండదని చెప్పారు.

జగన్ పైన ముప్పేట దాడి
కాగా, నందిగామ ఆసుపత్రిలో జరిగిన సంఘటన పైన పోలీసులు, అధికారులు, మంత్రులు.. చివరకు సీఎం చంద్రబాబు కూడా మండిపడుతున్నారు. జగన్ పైన ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి దేవినేని, ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

కలెక్టర్‌తో దురుసుగా జగన్
కలెక్టర్ బాబుకు ఐఏఎస్ అధికారుల సంఘం సంఘీభావం తెలిపింది. ఆసుపత్రిలో జరిగిన సంఘటన పైన ఆసుపత్రి కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆసుపత్రి వద్ద మంగళవారం జగన్.. అధికారులు, కలెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అధికారుల ఆగ్రహం
జగన్ తీరును ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. కలెక్టర్ అన్న గౌరవం లేకుండా జగన్ ప్రవర్తించారని ఐఏఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై చర్చించేందుకు ఈరోజు ఐఏఎస్‌ల సంఘం అధ్యక్షుడు ఫరీదా ఆధ్వర్యంలో అధికారులు సచివాలయంలో సమావేశం కానున్నారు.

వైసిపి ప్రతిస్పందన
జిల్లా కలెక్టర్ పైన జగన్ ప్రవర్తించిన తీరుపై ముప్పేట దాడి జరగడంపై వైసిపి ఎమ్మెల్యే రోజా స్పందించారు. చట్ట వ్యతిరేకంగా వాహనాలు నడుపుతున్నా సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న ప్రయివేటు బస్సులను తక్షణమే నిలిపేయాలని ఆ ట్రావెల్స్‌కు చెందిన ఎంపీలను బర్తరఫ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. జగన్ పైన కేసు పెట్టారు సరే.. పుష్కరాల్లో భక్తుల మృతికి కారకుడైన చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications