సింగపూర్ ప్రధానికి అభినందనలు, తెలుగు జాతి చరిత్రలోనే: చంద్రబాబు

అమరావతి: అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ కార్యక్రమం తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 33వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేశంలోనే చారిత్రాత్మకమన్నారు.

దీనిని ఒక నమూనాగా జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయన్నారు. అంతక ముందు సింగపూర్ ప్రధానిగా తిరిగి ఎన్నికైన లీసిన్ లూంగ్‌కు సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. శుక్రవారం వెలువడిన సింగపూర్‌ పార్లమెంటుఎన్నికల ఫలితాల్లో అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ(పీఏపీ) ఘనవిజయం సాధించింది.

89 సీట్లకు గాను 83 స్థానాలను కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. దీంతో ప్రధానిగా లీసీన్‌ లూంగ్‌ తిరిగి ఎన్నికయ్యారు. దాదాపు అర్ధ శతాబ్ధకాలంగా అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలనుకున్న ప్రతిపక్షం కలలు కల్లలయ్యాయి. 1965లో సింగపూర్ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఎన్నికలోనూ పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం సాధిస్తుండడం విశేషం.

Chandrababu naidu congratulations lee hsien loong to re-elected as PM

సింగపూర్‌ ప్రజలు లీసీన్‌ లూంగ్‌ నాయకత్వంపై నమ్మకం ఉంచి తిరిగి అధికారాన్ని కట్టబెట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కాగా, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధానిగా తిరిగి ఎన్నికైన లీసీన్‌ లూంగ్‌ శుక్రవారం లేఖ కూడా రాశారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


ఏపీ రాజధాని నిర్మాణానికి రైతుల విరాళం

ఏపీ రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు విరాళమిచ్చారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులు కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు చెల్లించిన వార్షిక అద్దెల మొత్తం రూ. 3, 52, 679 చెక్‌ను రాజధాని నిర్మాణానికి విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ మొత్తాన్ని సీఎంకి అందజేశారు.

పట్టిసీమ లాగా పోలవరాన్ని పూర్తి చేయాలి: బీజేపీ నేతలు

పోలవరం పనులు నిరాశ కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు అన్నారు. శనివారం ఉదయం పోలవరం ప్రాజెక్టును బీజేపీ నేతల బృందం పరిశీలించింది. పట్టిసీమ లాగే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కోరారు.

సాధారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని, కానీ పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోపే పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రిలోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టును సందర్శించిన బృందంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+