అప్పుడే బాబుతో ఎడం?: ఆహ్వానం పంపని వెంకయ్య!, సీఎం ఢిల్లీ పర్యటన రద్దు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు.

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు అంతకుముందు సీఎం ప్రకటించారు.

అయితే కారణాలేంటనేది తెలియదు గానీ సీఎం తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పర్యటన కోసం కేబినెట్ సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్న ఆయన.. తిరిగి కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

chandrababu naidu delhi tour cancelled

సీఎం ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా రద్దు కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు వెంకయ్య నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందిందా? లేదా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లడం సబబు కాదని అనుకున్నందువల్లే పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

ఇన్నాళ్లు చంద్రబాబు-వెంకయ్యల మధ్య కొనసాగిన సాన్నిహిత్యం స్థానంలో ఇకనుంచి ఎడం పెరిగే సూచనలున్నాయన్న దానికి ఈ పరిణామం ఊతమిస్తోంది. నామినేషన్ కు చంద్రబాబును ఆహ్వానించలేదంటే.. ఇప్పటినుంచే ఆ దూరం మొదలైందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

శ్రీలంకలో పారిశ్రామిక పార్కు:

మంగళవారం ఉదయం శ్రీలంక ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిలోని వెలగపూడిలో జరిగిన ఈ సమావేశంలో.. శ్రీలంకలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు గురించి చర్చించారు. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం 600ఎకరాల భూమిని కేటాయించడానికి శ్రీలంక ఒప్పుకున్నట్లు నోట్ లో తెలిపారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు ద్వారా శ్రీలంకలో టూరిజం, ఫార్మా, హార్టికల్చర్ రంగాలు అభివృద్ధి చెందుతాయ‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. త్వరలోనే రాష్ట్రం నుంచి అధ్యయనం కోసం ఒక ప్రతినిధుల బృందాన్ని శ్రీలంక‌ పంపించనున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+