కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప నేతలకు బాబు షాక్: లెక్కలు చెప్పి చుక్కలు చూపిన బాబు

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లా నేతలకు క్లాస్ తీసుకొన్నారు.ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై నేతలు అలసత్వంగా ఉన్నారని బాబు అసంతృప్తినేతలు సమన్వయంతో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయా

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలకు చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకొన్నారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమం ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వంత జిల్లా కడప. 2019 ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.

వైసీపీ చేపట్టిన వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమం కంటే ఇంటింటికి టిడిపి కార్యక్రమం బాగుందని టిడిపి నేతలు సంతోషపడ్డారు. కానీ, చంద్రబాబునాయుడు తన వద్ద ఉన్న లెక్కలతో ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై టిడిపి నేతలకు చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకొన్నారు.

కడప జిల్లాలో పార్టీకి ఆదరణ ఉన్నా... దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నట్టుగా టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు. నేతలంతా సమన్వయంతో పార్టీ అభివృద్ది కోసం పనిచేయాలని సూచించారు చంద్రబాబునాయుడు.

కడప నేతలకు చంద్రబాబునాయుడు క్లాస్

కడప నేతలకు చంద్రబాబునాయుడు క్లాస్

ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై కడప నేతలకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకొన్నారని సమాచారం. కడప జిల్లాలో ఇంటింటికి టిడిపి కార్యక్రమం ఆశించిన మేర సక్సెస్ కాలేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.వైసీపీ చీఫ్ జగన్‌ జిల్లాలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో నేతల తీరును చంద్రబాబునాయుడు తప్పుబట్టారు.పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

ఐదు నియోజకవర్గాల్లో సి గ్రేడ్

ఐదు నియోజకవర్గాల్లో సి గ్రేడ్

కడప జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి చంద్రబాబునాయుడు సి గ్రేడ్ ఇచ్చారు. ఈ 5 నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పులివెందుల, బద్వేలు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబునాయుడు సి గ్రేడ్ ఇచ్చారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల పనితీరు సరిగా లేదని బాబు అభిప్రాయపడ్డారు.తన వద్ద ఉన్న సమాచారంతో టిడిపి నేతలను ఆశ్చర్యానికి గురిచేశారు చంద్రబాబు. తాము సమర్థించుకొనే ప్రయత్నం చేసిన బాబు చూపిన లెక్కలతో తెలుగుతమ్ముళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు.

నాలుగు నియోజకవర్గాల నేతలపై సంతృప్తి

నాలుగు నియోజకవర్గాల నేతలపై సంతృప్తి

కడప జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల పనితీరును చంద్రబాబునాయుడు ప్రశంసించారు. , కడప, జమ్మలమడుగు, కమలాపురం. ప్రోద్దుటూరు
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికి టిడిపి కార్యక్రమం నిర్వహించిన తీరుపై చంద్రబాబునాయుడు సంతృప్తి చెందారు.అన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహ పరిస్థితి ఉండాలని చంద్రబాబునాయుడు చెప్పారు.

రాజంపేట, రాయచోటిలో ఆదరణ

రాజంపేట, రాయచోటిలో ఆదరణ

2019 ఎన్నికల్లో కడప జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే రాజంపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రజలు ఆదరణ చూపిస్తున్న నాయకత్వం మాత్రం ఆశించిన మేర ఉపయోగించుకోవడం లేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు చంద్రబాబునాయుడు.

English summary
Tdp chief Chandrababu naidu dissatisfied about Intintiki Tdp programme in Kadapa district.Chandrababu naidu reviewed on Intintiki Tdp programme in Kadapa district recently.Kadapa leaders assured to Babu fulfill their target on Intintiki Tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X