• search

అద్భుతంగా అసెంబ్లీ, హైకోర్టు: రాజధానికి వన్నె తెచ్చే భవనాలివే(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన శాసనభ, హైకోర్టుల ఆకృతులను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రభుత్వానికి అందజేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ప్రాథమిక ఆకృతులు, అంతర్గత నిర్మాణ శైలికి సంబంధించిన ప్రణాళికను ఇందులో పేర్కొంది. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో పరిశీలించారు.

  అదేవిధంగా తిరుపతిలో నిర్మించతలపెట్టిన సైన్సు సిటీలో ఏడు మ్యూజియాలను ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. అవి మరో సప్తగిరులుగా ప్రఖ్యాతి గాంచేలా డిజైన్లు రూపొందించాలని సీఎం ఆకాంక్షించారు.

  కీలక సమీక్ష

  కీలక సమీక్ష

  వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పోర్టులు, విమానాశ్రయాలు, పవర్ ప్రాజెక్టులు, గ్యాస్ పైపులైను ఏర్పాటు, ఫైబర్ నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సైన్సు సిటీలో ఇండోర్ రెయిన్ ఫారెస్టు, బయోడైవర్సిటీ మ్యూజియం, ఎవల్యూషన్, ఆంత్రోపాలజీ, ఆర్ట్సు సైన్స్, చిల్డ్రన్, ప్లానిటోరియం, మీడియా మ్యూజియం, ఎయిర్‌స్పేస్, డిఫెన్సు మ్యూజియం, ట్రాన్స్‌పోర్టు మ్యూజియం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

   Andhra Pradesh Division విభజనతో ఏపీకి ఎంతో మేలు జరిగింది, జగన్! | Oneindia Telugu
   ఐకానిక్ భవనాలు

   ఐకానిక్ భవనాలు

   శాసనసభ, హైకోర్టు భవనాల అంతర్గత నిర్మాణ ప్రణాళిక బాగుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ శాసనసభ భవనాన్ని వజ్రాకృతిలో, హైకోర్టు భవనాన్ని బౌద్ధ స్థూపాకారంలో డిజైన్‌ చేసింది. వీటిలో శాసనసభ భవన ఆకృతిని గురువారం శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులకు చూపించి, వారి అభిప్రాయాలు తీసుకున్నాక ఖరారు చేద్దామని చెప్పారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

   అద్భుతంగా హైకోర్టు..

   అద్భుతంగా హైకోర్టు..

   హైకోర్టు భవనానికి సంబంధించి మరో ఒకటి రెండు ఆకృతులు సిద్ధం చేసుకుని రావాలని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా ఉండాలని తెలిపారు. శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు ప్రపంచానికే తలమానికంగా ఉండాలని మొదటి నుంచీ చెబుతున్నానని, అందులో రాజీ పడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. హైకోర్టు భవంతి లోపల ఎలాంటి సౌకర్యాలుండాలో, అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలో హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. బాహ్య ఆకృతి మాత్రం తనతోపాటు, రాష్ట్ర ప్రజలందరూ నచ్చి, మెచ్చేలా ఉండాలని అద్భుతంగా రూపొందించి, తీసుకురావాలని సూచించారు.

   వజ్రాకృతిలో అసెంబ్లీ

   వజ్రాకృతిలో అసెంబ్లీ

   శాసనసభ భవనాన్ని 35 ఎకరాల్లో వజ్రాకృతిలో నిర్మాణం జరగనుంది. నాలుగు అంతస్తులుగా ఉంటుంది. 7.5 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది.

   * భవనం ఎత్తు 40 మీటర్లు ఉంటుంది. మొదటి అంతస్తును నాలుగు భాగాలుగా రూపొందించారు. మధ్యలో పబ్లిక్‌ ప్లేస్‌కు కేటాయించారు. మధ్యభాగం నుంచి పైకి వెళ్లేందుకు వర్తులాకారపు మెట్లు ఉంటాయి. 120 అడుగుల ఎత్తుకి వెళ్లి, అక్కడి నుంచి నగరాన్ని చూడొచ్చు.

   కార్యాలయాలు ఇలా..

   కార్యాలయాలు ఇలా..

   అసెంబ్లీ మొదటి అంతస్తును ముఖ్యమంత్రి, మంత్రులు, సభాపతి, పబ్లిక్‌, ప్రెస్‌ కార్యాలయాల కోసం కేటాయించారు. శాసనసభ, శాసనమండలి కోసం రెండు వేర్వేరు భవనాలు ఈ సముదాయంలోనే అంతర్గతంగా ఉంటాయి. 250 సీట్లతో శాసనసభ మందిరాన్ని నిర్మిస్తారు. అవసరమైతే 300 సీట్లకు పెంచుకోవచ్చు.

   * 125 సీట్లతో శాసనమండలి మందిరం ఉంటుంది. త్రిభుజాకారంలో నిర్మించే బాల్కనీలు శాసనసభ నిర్మాణానికే ముఖ్య అలంకారంగా ఉంటాయి. శాసనసభ కింది అంతస్తులోని మధ్య భాగం నుంచి వజ్రాకృతి మొదలవుతుంది. ఇది మొత్తం భవనం పై అంతస్తు వరకూ ఉంటుంది. పై భాగంలో వజ్రాకారం స్పష్టంగా కనిపిస్తుంది. పై భాగంలో మ్యూజియం ఉంటుంది. ఇందులోకి ప్రజలందరికీ ప్రవేశం ఉంటుంది.

   బౌద్ధ స్థూపాకృతిలో.. హైకోర్టు భవనం

   బౌద్ధ స్థూపాకృతిలో.. హైకోర్టు భవనం

   నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ బౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు డిజైన్‌ రూపొందించింది. అంతర్గత వసతులు, ప్రణాళికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఏడుగురు సభ్యుల న్యాయమూర్తుల బృందం 95 శాతం సంతృప్తి వ్యక్తం చేసిందని, 5శాతం సూచనలు చేశారని, తుది ఆకృతుల రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు భవనాన్ని 50 ఎకరాల్లో నిర్మిస్తారు. ఆరు అంతస్తులుగా ఉంటుంది. 14.5 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది. 48 కోర్టులుంటాయి. మరో 18 కోర్టులు పెంచుకునే వీలుంటుంది. 5వేల మంది పట్టే సామర్థ్యంతో కోర్టుల్ని డిజైన్‌ చేశారు.

   సచివాలయ భవనం

   సచివాలయ భవనం

   మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు 300 నుంచి 400 మీటర్ల దూరంలో వేర్వేరు భవనాల్లో ఉండేలా భవనాల నిర్మాణ ప్రణాళికలు రూపొందించామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. వీటికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రెండు ఆప్షన్లతో డిజైన్లు సిద్ధం చేసింది. వీటిపైనా గురువారం జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకుంటారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Chief Minister N Chandrababu Naidu will finalise the designs of government buildings to come up in capital city after discussing Ministers and other senior officials. He directed officials to arrange a special meeting at Secretariat on Thursday.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more