అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాపింగ్: ఏపీ కేబినెట్‌కు డీజీపీ, బాబు ఆగ్రహం..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు పోలీసు అధికారులపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాకులో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ డీజీపీ రాముడు ప్రత్యేకంగా హాజరయ్యారు.

సాధారణంగా కేబినెట్ సమావేశాలకు పోలీసులకు అనుమతి ఉండదు. కానీ, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఆడియో టేపుల, తదనంతర పరిణామాల నేపథ్యంలో దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం జేవీ రాముడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ మంత్ర వర్గ సమావేశానికి డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు సీఎం ఫోన్ ట్యాప్ అవుతున్నా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఏపీ ఇంటిలిజెన్స్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని, ఇది చట్టరీత్యా చెల్లదని కేబినెట్‌లో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. జూన్ 10న ఢిల్లీలో చైనా ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారులపై కేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

English summary
Chandrababu naidu fires ap dgp at ap cabinet meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X