గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు (ఫోటోలు)
అమరావతి: భవిష్యత్తులో ఏపీని నాలెడ్జ్ హబ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని, దానిని సాధించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని ఆయన తెలిపారు.
డీఎస్సీ 2014కు ఎంపికైన టీచర్లకు బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆయన నియమామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలివితేటలు, పట్టుదల ఎక్కువని ఉంటాయని ఆయన తెలిపారు. వారికి సరైన విధంగా శిక్షణ ఇస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని, ఆ బాధ్యత టీచర్లపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. పిల్లల్లో పోటీతత్వం పెంపొందించే విధంగా టీచర్లు ప్రయత్నించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో బాగా పనిచేసిన టీచర్లకు మంచి ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ ఉపాధ్యాయులు తిరిగేవారని, దానిని అధిగమించడానికి కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు.
విద్యాశాఖ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయమని సీఎం చంద్రబాబు అన్నారు. టీచర్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నియామక పత్రాలు అందుకున్న 8926 మందిలో 5208 మంది మహిళలే అని తెలిపారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
‘మహిళలు ఎక్కువ మంది ఎంపిక కావడం అనందంగా ఉంది. ఆడపిల్లలు ఉపాధ్యాయులుగా ఉంటే విద్యలో నాణ్య త ప్రమాణాలు పెరుగుతాయి' అని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో లెర్నింగ్ ఎబిలిటీస్ పెంపొదించుకుంటూనే వారు కూడా నేర్చుకోవాలని సూచించారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
‘పుట్టకతోనే ఏది సాధ్యం కాదు.. సాధన చేస్తే అన్ని సాధ్యమవుతాయి' అని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ కూడా అదే చేసే వారని... మద్రాసు సముద్ర తీరానికి వెళ్లి గులక రాళ్లు నోటిలో వేసుకుని డైలాగులు సాధన చేసే వారని గుర్తుచేశారు. ‘ఉపాధ్యాయులు మంచి బోధనలు చేసి విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
అప్పుడే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశానికి వస్తుంది' అని సూచించారు. చిన్నతనంలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను తన జీవితంలో శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటానన్నారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
‘‘రాష్ట్రంలో విద్యాశాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. కానీ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చదువుకునే రోజులు రావాలి'' అని సీఎం చంద్రబాబు అన్నారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
ప్రధాన మంత్రి 'డిజిటల్ ఇండియా' పిలుపు మేరకు రాష్ట్రంలో పైబర్ గ్రిడ్‌ను తీసుకువస్తున్నామని, దీని ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
పైబర్ గ్రిడ్ అందుబాటులోకి రాగానే ప్రతి ఇంటికీ ఒక గూగుల్ అకౌంట్‌ను ఇచ్చి, ఈ-మెయిల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీని ద్వారానే పిల్లల హాజరు, మార్కులను విద్యార్థులకు ఇంటికి మెయిల్ చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు కూడా గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని చంద్రబాబు వెల్లడించారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
‘నేను ఎక్కడికి వెళ్లినా కొత్త విషయాలు నేర్చుకుని వినూత్నంగా ఆలోచనలు చేసి ఇక్కడ అమలు చేస్తున్నా. తెలుసుకోవాల్సిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. ‘నేను నిత్య విద్యార్థిని' అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు, 4.5 లక్షల మంది విద్యార్థులు, 4.5 లక్షల మంది ఉద్యోగులు... ప్రతి ఒక్కరూ ప్రతి నెల ఒక చెట్టు నాటాలని సీఎం కోరారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
‘విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, ప్రకృతి కాపాడటం, సేవా భావం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది' అని స్పష్టంచేశారు. గతంలో ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంలో సైకిల్ అందించామని ఇప్పుడు ఆదే విధంగా తొమ్మిదో తరగతి పిల్లలకు సైకిల్స్ అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

గులక రాళ్లను నోట్లో వేసుకుని సాధన చేసేవారు: ఎన్టీఆర్‌పై చంద్రబాబు
పురుషులతో సమానంగా ఆడపిల్లలు చదవాలని ఆకాంక్షించారు. అనంతరం డీఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు అందించిన సీఎం చంద్రబాబు.. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications