వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! ఆ రూ. 3వేల కోట్లు ఎవరిస్తారు?: టీడీపీ నేతల పార్టీ మార్పుపై చంద్రబాబు తీవ్ర స్పందన

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓ వైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నుంచి అధిరాక పార్టీలోకి వలసలు ఏపీలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

<strong>చంద్రబాబు నమ్మకద్రోహి: 'దేవుడు' అంటూ బాలకృష్ణపై కదిరి బాబూరావు సంచలన వ్యాఖ్యలు</strong>చంద్రబాబు నమ్మకద్రోహి: 'దేవుడు' అంటూ బాలకృష్ణపై కదిరి బాబూరావు సంచలన వ్యాఖ్యలు

ఆ రూ. 3వేల కోట్లు ఎవరిస్తారు?

ఆ రూ. 3వేల కోట్లు ఎవరిస్తారు?

మంగళగిరిగిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారని, ఇప్పుడు వాటిని తొలగించాలంటే సుమారు రూ. 3వేల కోట్ల వరకు ఖర్చవుతుందని చంద్రబాబు అన్నారు. ఆ డబ్బు వైసీపీ నేతలు ఇస్తారా? అని నిలదీశారు. కోర్టులు మొట్టికాయలు వేసినా జగన్ సర్కారు తీరు మారడం లేదని మండిపడ్డారు.

అధికార పార్టీ దౌర్జన్యాలు.. ఈసీదే బాధ్యత..

అధికార పార్టీ దౌర్జన్యాలు.. ఈసీదే బాధ్యత..

మంత్రాలయం, సూళ్లూరుపేటలో టీడీపీ నేతలపై అధికార వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. రేపల్లె, నగరిలో తమ పార్టీవారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికారులు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. అభ్యర్థులకు సమయానికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానిదే బాధ్యత అని అన్నారు. స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు. మద్యం, డబ్బు పంచవద్దని తమ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశామని చెప్పారు.

వైసీపీవి సిగ్గులేని రాజకీయాలు..

వైసీపీవి సిగ్గులేని రాజకీయాలు..

ఇక అధికార పార్టీలోకి టీడీపీ నుంచి వలసలు పెరుగుతుండటంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీకి చెందిన నాయకుల్ని అధికార వైసీపీ లొంగదీసుకుంటోందని ఆరోపించారు. ప్రలోభాలకు గురిచేస్తేనో.. భయపెడుతుంటేనో.. వైసీపీలోకి నేతలు వెళ్తున్నారని అన్నారు. అధికార వైసీపీ సిగ్గులేని రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

Recommended Video

Minister Peddireddy Ramachandra Reddy Counters On Chandrababu & TDP | Oneindia Telugu
టీడీపీ నేతల ఇళ్లకు బలిసి వెళ్తున్నారా?

టీడీపీ నేతల ఇళ్లకు బలిసి వెళ్తున్నారా?

టీడీపీ నేతల ఇళ్లకు వైసీపీ వాళ్లు రాత్రులు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఒళ్లు బలిసి వాళ్ల ఇళ్లకు వెళ్తున్నారా? అని ఘాటుగా స్పందించారు. పలుచోట్ల టీడీపీ, బీజేపీకి చెందిన అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతమంది పార్టీని వీడినా.. టీడీపీలో కొత్త నేతలకు కొదవలేదని అన్నారు.

English summary
chandrababu naidu hits out at cm ys jagan for govt offices colors issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X