బిల్ గేట్స్‌కే ప్రజెంటేషన్ ఇచ్చా: బాబు, అమరావతికి టెక్ కంపెనీల క్యూ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తాను బిల్ గేట్స్‌కే ప్రజెంటేషన్ ఇచ్చానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైస్కూల్ లేని రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలలో వచ్చాయని, అందుకు టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధే కారణమని అభిప్రాయపడ్డారు.

విజయవాడలో ఐటీ రంగానికి పునాదులు వేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన ఎనిమిది కంపెనీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అమరావతిని ఐటీ కేంద్రంగా, ఏపీని సిలికాన్‌ వ్యాలీగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెప్పారు.

పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు మీ తీరు చూశా: సొంత నేతలకు బాబు షాక్

విజయవాడలో ఐటీ రంగానికి పునాదులు వేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన ఎనిమిది కంపెనీలను ప్రారంభించారు. నైపుణ్యం కల్గిన యువత ఏపీ సొంతమని, వారికి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు.

 Chandrababu Naidu Invites IT Companies to Invest in Andhra Pradesh

విదేశాలకు వెళ్లినవారు తిరిగి పుట్టినగడ్డకు వచ్చి కంపెనీలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. భవిష్యత్తులో ఏపీలో ఐటీ రంగం ఎలా ఉండబోతుందో ఈ సందర్భంగా వివరించారు.

ఒకనాడు ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉండేదని.. దానిని విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా మార్చే క్రమంలో హైటెక్ సిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. ఆ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు తాను ఎంతో శ్రమించానన్నారు.

ఆ తర్వాత ఎన్నో ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌ బాట పట్టాయన్నారు. కంపెనీలకు మానవ వనరులను సమకూర్చే లక్ష్యంతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వందలాది ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిచ్చినట్లు చెప్పారు.

ఏపీని విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలితంగానే మెరికల్లాంటి ఐటీ నిపుణులు తయారయ్యారన్నారు. ప్రస్తుతం ఎనిమిది కంపెనీలతో ప్రారంభమై.. ఈ ప్రస్థానం వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలన్నారు.

జూలై నాటికి మరిన్ని కంపెనీలు అమరావతికి రానున్నాయని చెప్పారు. ప్రపంచ తొలి అయిదు నగరాల్లో అమరావతి నిలుస్తుందన్నారు. హైటెక్ సిటీ కంటే బ్రహ్మాండమైన ప్రాంతాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu Inviteed IT Companies to Invest in Andhra Pradesh.
Please Wait while comments are loading...