హైడ్రామా!: బాబు ఫోన్ ఎత్తిన జగన్ పీఏ, నమస్తే అన్నా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 8వ తేదీన జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాలుగైదు సార్లు ఫోన్ చేసినా జగన్ అందుబాటులోకి రాలేదు.

జగన్ సహాయకుడు ఫోన్ ఎత్తి సార్‌తో ఫోన్ చేయిస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత జగన్ ఫోన్ చేయలేదు. చంద్రబాబు శుక్రవారం మరోసారి ప్రయత్నించారుడ. అప్పుడు జగన్ అందుబాటులోకి వచ్చారు. ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు. జగన్ బాబుకు అభినందనలు కూడా తెలిపారు. ప్రమాణ స్వీకారానికి పిలినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్

హైడ్రామా!

రాజమండ్రి పర్యటనలో ఉన్న జగన్‌కు చంద్రబాబు నాలుగైదు సార్లు ఫోన్ చేసినా... అటువైపు నుంచి స్పందన రాలేదు. చంద్రబాబు ఫోన్ చేసినా స్పందించని జగన్ అంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేయడంతో జగన్ అందుబాటులోకి వచ్చారు.

సమాచారం ప్రకారం... కంగ్రాట్స్ అన్నా! నమస్తే అన్నా! అంటూ చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారూ, నా ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని ఫోన్ చేశాను.. తప్పకుండా రండి అని చంద్రబాబు ఆహ్వానించారు. దీనికి సమాధానంగా జగన్... థ్యాంక్స్ అన్నా, ఉంటా అన్నా... ఇంకోసారి కంగ్రాట్స్ అన్నా! అని ఫోన్ పెట్టేశారట. అయితే సమీక్షా సమావేశంలో జగన్ ఉండటంతో అందుబాటులోకి రాలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+