పెద్దిరెడ్డి అడ్డాలో 900 ఎకరాల భూములు స్వాహా, మ్యాటర్ లాగిన సీఎం చంద్రబాబు
ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారని తెలిసింది. అమరావతిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ఆయన పరోక్షంగా మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
పుంగనూరు మండలంలోనే ఏకంగా 982 ఎకరాల అనాధీనం భూమిని రాచమార్గంలో వైసీపీ నాయకులకు రాసిచ్చేశారని, ఆ విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కలకలం రేపుతోంది. పుంగనూరు మండలంలోని రాగానిపల్లెలోనే ఈ మొత్తం ఈ 982 ఎకరాల ఆక్రమణ తతంగం జరిగిందని వెలుగు చూసింది, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పెద్దాయన ఈ తంతంగం నడిపించారని చంద్రబాబు నాయుడు పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద విరుచుకుపడ్డారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమ మైనింగ్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యత సంచరించుకుంది. పుంగనూరు మండలంలో స్వాహా చేసిన భూముల విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో అక్రమ మైనింగ్ కు సంబంధించి పూర్తి సమాచారం బయటకు లాగుగతున్నారని వెలుగు చూసింది.
పుంగనూరు నియోజక వర్గంలో ప్రభుత్వం, ప్రైవేటు భూముల ఆక్రమణలపై విచారణ జరిపించాలని ప్రజలు మనవి చేస్తున్నారని, ఆ ధిశగా అధికారులు సమాచారం సేకరించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారని సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు చెప్పినట్టు విననని మైనింగ్ యజమానులను బెదిరించారని, అప్పటికీ వాళ్లు లొంగకపోవడంతో సుమారు రూ. 250 కోట్లు జరిమానా విధించారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం జరిమానా విధించిన వారిలో ఒక్కరైనా వైసీపీ నాయకుడు ఉన్నారా అని చెప్పాని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మదనపల్లె నియోజక వర్గంతో పాటు తన సొంత నియోజక వర్గంలోని శాంతిపురం మండంలోని అక్రమ క్వారీలను పరిశీలించడానికి తనకు కూడా అప్పట్లో అవకాశం ఇవ్వలేదని, గత వైసీపీ పాలన మొత్తం అవినీతి మయం అయ్యిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి అడ్డా అయిన సోమల మండంలో సుమారు 70 ఎకరాల అటవి భూములను వైసీపీ నాయకులు అక్రమించుకున్నారని, అందులోని కొన్ని ఎకరాల్లో మామిడి చెట్టు నాటుకున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
మేము నీతికి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే జగన్ కాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఈ విషయాలు తెలీవా అని చంద్రబాబు ప్రశ్నించారు. పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అక్రమ మైనింగ్, ఇసుక దందా, భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, పూర్తి సమాచారం చేతికి వచ్చే వరకు సైలెంట్ టా ఉండాలని సీఎం బావించారని తెలిసింది.












Click it and Unblock the Notifications