రాజధానిపై బాబు కసరత్తు: నిర్మాణానికి 2 లక్షల కోట్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంచనా వేస్తున్నారు. చంద్రబాబుతో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితర అధికారులు భటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం చర్చకు వచ్చింది.
రాజధాని అందరికీ అనుకూలంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారని తెలుస్తోంది. కార్యాలయాలు, సచివాలయం మాత్రమే కాకుండా.. ప్రజలు అక్కడకు వచ్చి స్థిరపడేలా, పారిశ్రామిక కంపెనీలకు కేంద్రంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే నిర్మాణమైన కొత్త రాజధానికి సార్థకత ఉంటుందని భావిస్తున్నారు.

రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.2 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఈ సమావేశంలో అంచనాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజధాని నిర్మాణం పైన కేంద్రం సాయం అడిగేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకూ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధం కావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లోటు ఉన్నందున దానిని ఎలా అధిగమించాలనే విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications