వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య నాదెళ్ల ఎఫెక్ట్: బాబు అడ్డంగా బుక్కయ్యారా, అసలు ఏం చెప్పారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో... టిడిపి నేతలు ఎవరు కూడా వైసిపి పైన ఎదురు దాడికి దిగడం లేదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు పైన లేదా టిడిపి పైన విమర్శలు చేస్తే ఆ పార్టీ నేతలు వెంటనే స్పందిస్తారు. ధీటుగా వాటిని తిప్పికొడతారు. కాపు ఉద్యమం రగడ, కాల్ మనీ - సెక్స్ రాకెట్, హామీలపై వైసిపి విమర్శలు... ఇలా వైసిపి చేసే ప్రతి విమర్శలను టిడిపి కౌంటర్ చేస్తోంది.

కానీ, సత్య నాదెళ్ల విషయమై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన మాత్రం టిడిపి నేతలు ఎవరు పెదవి విప్పడం లేదు. వైసిపి నేతలు ఎంతగా విమర్శలు గుప్పిస్తున్నా, ఎంతగా చంద్రబాబును వెక్కిరిస్తున్నా.. వారు మాత్రం మాట్లాడటం లేదు. దీనికి చంద్రబాబు నోరు జారడమే కారణమని సొంత పార్టీ నేతలు కూడా భావిస్తున్నారంటున్నారు.

సత్య నాదెళ్లపై వ్యాఖ్య, చరిత్ర చెప్పి ఇరుక్కున్న బాబు: దులిపేసిన బుగ్గనసత్య నాదెళ్లపై వ్యాఖ్య, చరిత్ర చెప్పి ఇరుక్కున్న బాబు: దులిపేసిన బుగ్గన

Chandrababu Naidu lands in row over Satya Nadella claim

దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు పైన విమర్శలు గుప్పిస్తున్నారు. సత్య నాదెళ్ల మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారా అని ఎద్దేవా చేస్తున్నారు.

1992లోనే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్టులో జాయిన్ అయితే, 1995లో సీఎం అయిన చంద్రబాబు ఆయనకు ఎలా స్ఫూర్తినిచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడినందువల్లే టిడిపి నేతలు నోరు మెదపడం లేదని అంటున్నారు.

చంద్రబాబు ఏమన్నారు?

'సత్య నాదెళ్ల మన రాష్ట్రంలో పుట్టాడు. మన దగ్గర చదువుకున్నాడు. నేను ఐటీ గురించి మాట్లాడేవాడిని. వాళ్ల తండ్రి యుగంధర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉండేవాడు. నా దగ్గర పని చేసేవాడు. ఆయన ఒకటే చెప్పాడు. నేను ఫోన్ చేసి అభినందించాను. మీ అబ్బాయికి మైక్రోసాఫ్టులో ఉద్యోగం వచ్చిందని. దానికి ఆయన చెప్పింది.. మాములుగా అయితే ఐఏఎస్ ఆఫీసర్ గా వెళ్లేవాడు. మీరు ఐటీ గురించి మాట్లాడారు. దాని వల్ల ఆ చదువు చదివాడు. చదివిన తర్వాత మైక్రోసాఫ్టుకు వెళ్లాడు... ఈ రోజు మైక్రోసాఫ్టులో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు' అని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

కాగా, సత్య నాదెళ్లకు మైక్రోసాఫ్టులో 1992లోనే ఉద్యోగం వచ్చిందని, కానీ చంద్రబాబు ఏపీ సీఎంగా 1995లో అయ్యారని అలాంటప్పుడు ముందే ఎలా స్ఫూర్తి పొందారని వైసిపి ప్రశ్నిస్తోంది. అలాగే చంద్రబాబు 1995లో సీఎం అయ్యారని, కాని సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ అంతకుముందే రిటైర్ అయ్యారని వైసిపి నేతలు చెబుతున్నారు.

English summary
Andhra Pradesh chief minister N. Chandrababu Naidu’s claim that Microsoft CEO Satya Nadella was inspired by him and went into information technology instead of civil services has become controversial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X