వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం లెక్క ఇది, తప్పు చేసింది మీరు: జైట్లీపై తీవ్రస్థాయిలో ఊగిపోయిన బాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Lashed Out At Jaitley Over His Statement

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో కేవలం ప్రకటనతో సరిపోదని, నిర్దిష్ట కాలపరిమితి ఉండాల్సిందే అన్నారు.

బాబుకు లేఖ రాశాం, అలా అడిగితే నష్టం: ఏపీపై రాజ్యసభలో జైట్లీ కీలక ప్రకటన, రైల్వే జోన్‌పై గోయల్బాబుకు లేఖ రాశాం, అలా అడిగితే నష్టం: ఏపీపై రాజ్యసభలో జైట్లీ కీలక ప్రకటన, రైల్వే జోన్‌పై గోయల్

ఆర్థిక లోటుపై ఇంకేం క్లారిటీ కావాలంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజనకు లేని విధివిధానాలు న్యాయం చేయడానికి కావాలా అని నిలదీశారు. నాబార్డు నిధుల గురించి ప్రస్తావించిన జైట్లీ మిగతావి వదిలేయడం ఏమాత్రం సరికాదన్నారు. 5 కోట్ల మందికి అన్యాయం జరిగిందన్నారు.

సోము వీర్రాజుకు చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్, మోడీని కలవడంపై ఇలాసోము వీర్రాజుకు చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్, మోడీని కలవడంపై ఇలా

దేశం మొత్తం తెలిసేలా చేశాం

దేశం మొత్తం తెలిసేలా చేశాం

టీడీపీ ఎంపీలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సమస్యను జాతీయ సమస్యగా మార్చామని వ్యాఖ్యానించారు. నవ్యాంధ్రకు జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని వ్యాఖ్యానించారు. దీనిని హేతుబద్దంగా ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పారు.

సస్పెండ్ చేసినా వెనుకడుగు వద్దు

సస్పెండ్ చేసినా వెనుకడుగు వద్దు

మనకు కేవలం ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. సభ నుంచి మనలను సస్పెండ్ చేసే పరిస్థితి ఉన్నా వెనుకంజ వేయవద్దని సూచించారు. విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలకు కేంద్రం కట్టుబడి ఉండాలని, సమయం కూడా చెప్పాలన్నారు.

 విభజనలో లేని ఫార్ములా ఆర్థిక లోటుతో ఆదుకోవడంలో కావాలా

విభజనలో లేని ఫార్ములా ఆర్థిక లోటుతో ఆదుకోవడంలో కావాలా

ఆర్థిక భర్తీ లోటుకు కొత్త ఫార్ములా కావాలన్న జైట్లీ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన విషయంలో లేని ఫార్ములా, ఏపీని ఆదుకోవడంలో కావాలా అని నిలదీశారు. విభజనను అన్యాయంగా చేశారన్నారు.

 ప్రత్యేకంగా రెండుగంటలు చర్చించాల్సిందే

ప్రత్యేకంగా రెండుగంటలు చర్చించాల్సిందే

ఏపీ విభజన సమస్యలపై పార్లమెంటులో ప్రత్యేకంగా రెండు గంటల పాటు చర్చించాల్సిందేనని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అప్పటి వరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఏ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలపై నిర్దిష్ట కాలపరిమితి చెప్పే వరకు ఆందోళన కొనసాగించాలన్నారు.

 నాబార్డు గురించి చెప్పి, మిగతావి వదిలేస్తారా

నాబార్డు గురించి చెప్పి, మిగతావి వదిలేస్తారా

అరుణ్ జైట్లీ నాబార్డు గురించి ప్రస్తావించి మిగతా వాటిని వదిలేయడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఏంపీకి ఏం చేస్తుందో స్పష్టంగా చెప్పాల్సిందే అన్నారు. అప్పటి కేంద్రం తప్పు చేసిందని, దానిని సరిదిద్దాల్సిన బాధ్యత నేటి కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

తప్పు చేసింది కేంద్రం కాబట్టి

తప్పు చేసింది కేంద్రం కాబట్టి

ఏపీకి జరిగిన అన్యాయంపై పూర్తిగా చర్చించేలా పట్టుబట్టాలని చంద్రబాబు సూచించారు. మాకు (ఏపీ) ఎంత నష్టం జరిగింది, ఈ నాలుగేళ్లలో ఏం చేశారు, మాకు ఏం చేస్తారు, ఎంత సమయంలో చేస్తారనే విషయంపై తేలాల్సిందే అన్నారు. తప్పు చేసింది కేంద్రం కాబట్టి, సరిదిద్దాల్సిన బాధ్యత దాని పైనే ఉందన్నారు.

 ఖర్గే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు

ఖర్గే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు

విభజన సమయంలో పార్లమెంటులో ఆరు నెలల పాటు పోరాటం చేశామని చంద్రబాబు ఎంపీలకు గుర్తు చేశారు. ఏపీకి అన్యాయం చేసినప్పుడు మల్లికార్జున ఖర్గే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎల్లుండి సభ వాయిదా పడుతుంది కాబట్టి ఈ రెండు రోజులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu lashed out at Union Minister Arun Jaitley over his statement in parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X