వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి-జగన్ ఈడీ కేసుల్లో సడలింపు, మీ తప్పులు నా నెత్తిన వేసుకోను: బీజేపీపై బాబు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులను సడలిస్తున్నారని, అవినీతి పరులను పక్కన పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఝలక్, వారికి జగన్ వల!: వైసీపీలోకి టీడీపీ నేత తనయుడుచంద్రబాబుకు ఝలక్, వారికి జగన్ వల!: వైసీపీలోకి టీడీపీ నేత తనయుడు

మీ తప్పిదాలు నా మీద వేసుకోను

మీ తప్పిదాలు నా మీద వేసుకోను

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతిలో నిర్వహించిన ధర్మ పోరాట సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. పార్టీలోని నేతలు చేసిన తప్పిదాలు తనపై వేసుకునేందుకు సిద్ధంగా లేనని ఆయన చెప్పారు. నేతల ప్రతి చర్యకూ ప్రజలలో ప్రతి చర్య ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతామన్నారు.

మోడీని విమర్శించాలా, నన్నా?

మోడీని విమర్శించాలా, నన్నా?

తిరుపతి తరహా మరో 12 చోట్ల ధర్మపోరాట సభలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. రెండో సభ విశాఖలో ఉంటుందని, చివరి సభ అమరావతిలో ఉంటుందని చెప్పారు. వైసీపీ నేతలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని విమర్శిస్తారా లేక పోరాటం చేస్తున్న టీడీపీని విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జగన్ అటాచ్‌మెంట్లు సడలిస్తున్నారు

జగన్ అటాచ్‌మెంట్లు సడలిస్తున్నారు

వైయస్ జగన్ పైన ఈడీ అటాచ్‌మెంట్లు సడలిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన మైనింగ్ కేసులు తొలగిస్తున్నారని చెప్పారు. ఇదేనా అవినీతిపై బీజేపీ చేసో పోరాటం అని ప్రశ్నించారు. కుడి, ఎడమల అవినీతిపరులను పెట్టుకొని బీజేపీ ప్రజలకు ఏం సందేశం ఇస్తోందన్నారు.

 బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలు కేస్ స్టడీ

బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలు కేస్ స్టడీ

మనపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి జరుగుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో నిన్నటి వరకు అత్యున్నత పదవులలో ఉన్న వారు పుస్తకాలు రాస్తున్నారని అన్నారు. తిరుపతి సభ పెట్టిన రోజే వైసీపీ విశాఖపట్నంలో వంచన దినం పెట్టడం వెనుక అజెండా ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలే కేస్ స్టడీ అని చంద్రబాబు అన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu lashes out at BJP over Gali and YS Jagan issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X