2రోజుల్లో రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు! లక్షల ఉద్యోగాలు, రాజధానిలో డబ్ల్యుటివో కేంద్రం
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తొలిరోజైన ఆదివారం రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. రెండో రోజైన సోమవారం దాదాపు అన్నే కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తొలి రోజుతో పోటీగా రెండో రోజు పెట్టుబడుల వరద పారింది.
భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, మైనింగ్, ఐటీ రంగాల్లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. అమరావతిలో డబ్ల్యూటీవో కేంద్రం ఏర్పాటు కానుంది. రెండు రోజుల్లో అక్షరాలా... మొత్తం రూ.3.89 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు వచ్చాయి.
విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాల నేపథ్యంలో లక్షలాది ఉద్యోగాలకు బాటలు పడుతున్నాయి. పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, మైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంధన, తయారీ, రిటైల్, సీఆర్‌డీఏ, గృహ నిర్మాణ, మౌలిక రంగాల్లో పెట్టుబడుల వరద కురుస్తోంది.

రెండో రోజైన సోమవారం ఒక్కరోజే ఏపీ ప్రభుత్వం 281 పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. దీని విలువ రూ.1,92,571 కోట్లు. ఈ ఒప్పందాలతో కొత్తగా 6,53,933 ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సు రెండు రోజుల్లో మొత్తం ఒప్పందాల సంఖ్య 313కు, పెట్టుబడుల మొత్తం రూ.3.89 లక్షల కోట్లకు పెరిగింది.
సోమవారం నాడు కుదిరిన వాటిలో భారీ పరిశ్రమల రంగానికి చెందిన వ్యాపార సంస్థలతో 101 ఒప్పందాలున్నాయి. అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రణాళిక, గృహ నిర్మాణం కోసం చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. పరిశ్రమల స్థాపనతో పాటు అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి కనబర్చాయి.

రెండో రోజు పెట్టుబడుల వివరాలు...
విశాఖపట్నం స్టీలు ప్లాంటు రూ.38,500 కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పొందించుకునేందుకు సిద్ధపడి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
మలేషియాకు చెందిన ఐసోమెరిక్ హోల్డింగ్స్ బెర్హాద్, విజయవాడకు చెందిన లింగమనేని ఎంటర్‌ప్రెన్యూర్స్ గ్రూపు సంయుక్త సంస్థ అయిన పెట్రో గ్యాస్, కృష్ణపట్నం పోర్టులో రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఎల్‌పీజీ రీ-గ్యాసిఫికేషన్ యూనిట్- ఫ్లోటింగ్ స్టోరేజ్ టెర్మినల్ నెలకొల్పనున్నాయి.
వాల్‌మార్ట్, కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ గ్రూపు, స్పెన్సర్స్, అరవింద్ లైఫ్‌స్టైల్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో రూ.1450 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
అమరావతి నిర్మాణానికి మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీ, అమలు, అభివృద్ధికోసం చైనాకు చెందిన జీఐఐసీతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడితో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను సమన్వయం చేసుకుంటూ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అవసరమైన సహాయం చేయనుంది.
గృహనిర్మాణ ప్రాజెక్టులపై నాలుగు ఎంవోయూలు కుదిరాయి. చైనాకు చెందిన పలు కంపెనీలు ఏపీ కంపెనీలతో కలిసి గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడతాయి. అమరావతి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసేందుకు హడ్కో, ఆంధ్రా బ్యాంకు ముందుకొచ్చాయి. హడ్కో రూ.7500 కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ.5వేల కోట్ల రుణాన్ని ఇవ్వనున్నాయి.

భారీ పరిశ్రమల విభాగానికి సంబంధించి అత్యధిక సంఖ్యలో 101 ఒప్పందాలు కుదిరాయి. దీనివల్ల రూ.69,496 కోట్ల పెట్టుబడులు లభిస్తాయి. దాదాపు 1,99,293 మందికి ఉపాధి లభిస్తుంది. భావనపాడు, కళింగపట్నం ప్రాంతాల్లో బీచ్ శాండ్ మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ట్రైమెక్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ.2500 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది.
63 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏపీలో రూ.3163 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. దీనివల్ల 50వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆహార ప్రాసెసింగ్ రంగంలో 65 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా కొత్తగా 62వేల మందికి ఉపాధి లభిస్తుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications