చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కష్టాలు.. కన్నీటి వెతలు, కిడ్నీలు పాడై ఒకరు, లుకేమియాతో బాధపడుతున్న చిన్నారితో మరొకరు, మానసిక వికలాంగుల తల్లిదండ్రులు ఇలా అనేక కష్టాలు బాధలతో వచ్చిన వారితో మంగళవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయం రద్దీగా మారింది. అందరి బాధలను, సమస్యలను, విజ్ఞప్తులను సావధానంగా విన్న ముఖ్యమంత్రి పెద్దమనసుతో స్పందించారు.

తక్షణమే బాధితులకు ఆర్ధికసాయం ప్రకటించారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వ్యాధి తీవ్రమవుతున్న పలువురి రోగుల వైద్య చికిత్సను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన పివి ప్రవీణ్ కుమార్ దంపతుల రెండేళ్ళ చిన్నారి బేబీ అరుషి ఎక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియాతో బాధపడుతోంది.

తమ చిన్నారికి వైద్య చికిత్స కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేసిన ఆ తల్లిదండ్రులు ఇక తమ చేతుల్లో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో మంగళవారం సీఎంను కలిసి వారి పరిస్థితిని వివరించారు. వారి బాధలను విన్న సీఎం చంద్రబాబు వెంటనే వైద్య చికిత్స కోసం 5 లక్షల రూపాయాలను మంజూరు చేశారు.

 చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

కడప జిల్లా కమలాపురం నుంచి వచ్చిన అతుల్‌బాషా దంపతులు సీఎం చంద్రబాబును కలసి బోరున విలపించారు. చేతికి అందివచ్చిన 22ఏళ్ళ తమకుమారుడు గౌస్‌బాషాకు రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలిపారు. తమను ఆదుకోవాలని కోరగా బాషా వైద్య చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వారికి భరోసానిచ్చారు.

 చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

కంకిపాడు వాస్తమ్యడు ప్రసాద్‌ తన తండ్రి కిడ్నీ వ్యాధి చికిత్స నిమిత్తం తమను ఆదుకోవాలని సీఎంను కోరగా వెంటనే రూ. 50 వేలు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లా కంబం అర్బన్‌ కాలనీలో నివసిస్తున్న పడిగ శ్రీనివాసరావు, రమాదేవి దంపతులకు నలుగురు సంతానం, వీరిలో ఇద్దరు శ్రావణి, సువర్ణలు మానసిక వికలాంగులు. వారిని ఆదుకోవాలని మొరపెట్టుకోగా తక్షణ సాయంగా రూ. 50వేలు మంజూరు చేశారు.

 చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు నుండి వచ్చిన మండా కిషోర్‌ తన నిరుపేద పరిస్థితిని వివరించగా 20వేలు మంజూరు చేశారు. గుంటూరుకు చెందిన విజయలక్ష్మికి 15వేలు, విజయవాడ వాసి అప్పాయమ్మ, ఎస్‌ రాధిక, ఉమామహేశ్వరిలకు చెరో 15వేలు, గుండెజబ్బుతో బాధపడుతున్న విజయవాడకు చెందిన సింహాద్రి సత్యనారాయణకు 15వేలు, కె.రమణమ్మ, కె.లక్ష్మి చెరో 15వేలు సాయం ప్రకటించారు.

 చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

చంద్రబాబు భరోసా: ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడుకు చెందిన జొన్నల నాగరత్నానికి 20వేలు మంజూరు చేశారు. విజయవాడ నుండి వచ్చిన దూపాటి రాములుకు 25వేలు, వనజాక్షికి 20వేలు మంజూరు చేశారు. నిరుపేదలైన కామేశ్వరి, కె.నాంచారమ్మలకు 15వేల సాయం ప్రకటించారు. రాగి శారదకు 20వేలు అందించారు. వినుకొండ కు చెందిన మేకల సత్తెమ్మకు 15వేలు, విశాఖ జిల్లా రోలుగుంటకు చెందిన యెనిమిరెడ్డి వెర్రినాయుడు, అదే మండల కేంద్రానికి చెందిన గొల్లు లావణ్య, కర్నూల్‌ జిల్లా మిటకందాలనుంచొచ్చిన జనార్ధనకు వరుసగా 15వేలు చొప్పున ఆర్ధికసాయాన్ని ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Cheif minister Chandrababu naidu meet with visitors in Vijayawada camp office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X