వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిన్నర తర్వాత 17న ప్రధానితో చంద్రబాబు భేటీ!: ఎంపీలకు మోడీ హామీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ నెల 12వ తేదీన లేదంటే 17న సమావేశం జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో దాదాపు ఏడాది తర్వాత సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ అవుతున్నారు.

పవన్‌ను అంత మాట అంటావా: కత్తి మహేష్‌కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్పవన్‌ను అంత మాట అంటావా: కత్తి మహేష్‌కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్

ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టుని గడువు ప్రకారం పూర్తి చేసేందుకు, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, విశాఖకు రైల్వే జోను, ఈఏపీ ప్రాజెక్టులకు సకాలంలో అనుమతులు, శానసనభ నియోజకవర్గాల పునర్విభజన వంటి పలు అంశాలపై చర్చించే అవకాశముంది.

 భేటీకి ప్రాధాన్యత

భేటీకి ప్రాధాన్యత

ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చిన హామీల్లో ఇంత వరకు ఎన్ని అమలయ్యాయి? ఎన్ని పెండింగులో ఉన్నాయి? వంటి అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడుతోంది.

 17నే ఖరారయ్యే అవకాశం

17నే ఖరారయ్యే అవకాశం

ఈ నెల 12న అపాయింటుమెంటు కావాలని సీఎం లేఖ రాయగా, సంక్రాంతి తర్వాత 17వ తేదీన రావాలని పీఎంవో సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రెండు తేదీల్లో ఒకటి ఖరారు కావొచ్చని అంటున్నారు. దాదాపు 17వ తేదీనే భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

 కేంద్రం పలు హామీలు

కేంద్రం పలు హామీలు

ప్రత్యేక హోదాను కాదని ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన సమయంలో కేంద్రం పలు హామీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలి. హోదా ఇవ్వనుందున దానిని భర్తీ చేసేందుకు 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రంలో ఈఏపీల కోసం తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యతను కేంద్రం తీసుకుంటానని హామీ ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఈఏపీ ప్రాజెక్టుల కోసం రంగం సిద్ధం చేసింది.

 పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం సాయం

పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం సాయం

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి వంద శాతం ఆర్థిక సాయం అందించే బాధ్యత తమదేనని ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రాష్ట్రం సొంతగా రూ.3,217 కోర్టుల ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రీయింబర్సుమెంట్స్ ఇవ్వాలి. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు, కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం పెరిగిన అంచనాలను అమోదించాల్సి ఉంది.

 ఎంపీలు కలిసినప్పుడు హామీ

ఎంపీలు కలిసినప్పుడు హామీ

రెండు రోజుల క్రితం టిడిపి ఎంపీలు ప్రధాని మోడీని కలిశారు. అప్పుడే చంద్రబాబు కూడా కలుస్తారని వారు ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. భేటీపై తాను తేదీని ఖరారు చేస్తానని ఎంపీలతో ప్రధాని చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భేటీ జరగబుతోంది.

English summary
The much awaited talks on bifurcation-related issues between Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and Prime Minister Narendra Modi are likely to take place in New Delhi on January 17. The TDP MPs met Modi on Friday and appealed to him to deliver on the promises made to Andhra Pradesh at the time of bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X