ప్రపంచం మెచ్చేలా అమరావతి: ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్‌లతో బాబు భేటీ(పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం ప్రపంచం మెచ్చే స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. దేశంలో తొలిసారి ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి ఆధునిక పరిపాలనకు రూపాంతరం చెందామని, కొత్త రాజధానిలో ప్రభుత్వ సముదాయాలు దానికి తగినట్టుగా అత్యంత ఆధునికంగా ఉండాలని స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం విజయవాడ తాజ్ గేట్‌వే హోటల్‌లో సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని, సీడ్ క్యాపిటల్ నిర్మాణాలపై మార్గదర్శనం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, జాతీయస్థాయిలో పేరొందిన ఆర్కిటెక్చర్లు ఈ జ్యూరీలో ఉన్నారు. జ్యూరీ సభ్యులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం ప్రత్యేకతలు వివరించారు.
సుదీర్ఘ కోస్తాతీరం, పుష్కలమైన జల, ఖనిజ వనరులు, నిత్య ఆవిష్కరణలు, ఆలోచనలు సాగించే దృఢ సంకల్పం గల మానవ వనరులకు ఈ రాష్ట్రంలో లోటు లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందుబాటులో, రాష్ట్రానికి నడిబొడ్డున, నది ఒడ్డున ఉండేలా కొత్త రాజధాని ఎంపిక జరిగిందని చెప్పారు. అమరావతి చారిత్రక ప్రాశస్థ్యాన్ని నిలబెట్టేలా, ఆంధ్రుల సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ భవనాల నిర్మాణం జరగాలన్నారు.
సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్ తదితర ప్రధాన ప్రభుత్వ భవనాలన్నీ ఐకానిక్ కట్టడాలుగా ఉండాలన్నారు. కేవలం ఈ భవనాలను సందర్శించేందుకే ప్రపంచ పర్యాటకులు వచ్చేలా రూపకల్పన చేయాలని కోరారు. భవిష్యత్‌లో ఇది టూరిజం డెస్టినేషన్ సిటీగా ఉండి తీరాలన్నారు.
బ్లూ, గ్రీన్, ఆక్వా సిటీగా అమరావతి ప్రభుత్వ భవనాలను డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలోని టాప్-5 నగరాలకు దీటుగా ఉండేలా అమరావతిని నిర్మించడానికి తగినట్టుగా సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని వివరించారు.
స్వాతంత్య్రం వచ్చాక దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల రాజధాని నిర్మాణాల్లో ఏ నగరం కూడా ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారలేకపోయాయని, అమరావతి నిర్మాణం ఆ లోటును తీర్చే నగరంగా విలసిల్లాలని సూచించారు.
కాగా, అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని జూన్, జులై మాసాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భవనాల సముదాయ ప్రణాళిక రూపకల్పనలో అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన నార్మన్ ఫాస్టర్, రిచర్డ్ రోజర్, ఫ్రాంక్ గెరీల సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం నియోగించుకుంటోంది. వీరు ముగ్గురి మధ్య ఒక పోటీ నిర్వహిస్తోంది.

చంద్రబాబు
ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం ప్రపంచం మెచ్చే స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు.

చంద్రబాబు
దేశంలో తొలిసారి ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఆన్‌లైన్ చేసి ఆధునిక పరిపాలనకు రూపాంతరం చెందామని, కొత్త రాజధానిలో ప్రభుత్వ సముదాయాలు దానికి తగినట్టుగా అత్యంత ఆధునికంగా ఉండాలని స్పష్టం చేశారు.

చంద్రబాబు
శుక్రవారం ఉదయం విజయవాడ తాజ్ గేట్‌వే హోటల్‌లో సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని, సీడ్ క్యాపిటల్ నిర్మాణాలపై మార్గదర్శనం చేశారు.

చంద్రబాబు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, జాతీయస్థాయిలో పేరొందిన ఆర్కిటెక్చర్లు ఈ జ్యూరీలో ఉన్నారు. జ్యూరీ సభ్యులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం ప్రత్యేకతలు వివరించారు.
ఫిబ్రవరి నాటికి ముగ్గురూ ప్రణాళికలు అందజేస్తారు. వాటిలో ఉత్తమమైన దానిని న్యాయ నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. శుక్రవారం సమావేశంలో ఆ ముగ్గురి తరఫున పంపించిన ప్రతినిధులు ఏడుగురు పాల్గొన్నారు. సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్ జైన్, కమిషనర్ ఎన్.శ్రీకాంత్, అధికారులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications