వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! ఈడీ ట్వీట్ మాటేమిటీ?: సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విశాఖలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విశాఖలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను టూరిజం, ఐటీ, లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని చెప్పారు.

డొల్ల కంపెనీలో జగన్‌ పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ ట్వీట్‌ చేసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు.. ఆ ట్వీట్‌పై జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిక నేరస్థుడు ఢిల్లీకి వెళ్లి చట్టాలు, రాజ్యాంగంపై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.

chandrababu naidu on ED Tweet on YS Jagan

ఇతర పార్టీ వాళ్లను జగన్‌ ఎప్పుడూ చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కనబెట్టి తాను పూర్తిగా రాష్ట్రాభివృద్ధిపైనా దృష్టిసారించినట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పదేళ్లు కష్టపడి పనిచేస్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. శాశ్వతంగా అధికారంలో ఉంటేనే సుస్థిర అభివృద్ధి అందించగలమన్నారు.

అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే మంత్రివర్గాన్ని విస్తరించామని చంద్రబాబు తెలిపారు. పార్టీలు ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ గగ్గోలు పెడుతున్న పార్టీలు... గతంలో ఫిరాయింపులు చేయలేదా? అని ప్రశ్నించారు.
కేసుల విచారణలో సీబీఐని ఇతరులు ప్రభావితం చేస్తున్నారంటూ విమర్శిస్తున్న జగన్... అగ్రిగోల్డ్ కేసులో సీబీఐ విచారణ కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.
తాను ఎంత సున్నితంగా ఉంటానో... అంతే కఠినంగా కూడా ఉంటానని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday responded on Enforcement Directorate Tweet on YSR Congress Party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X