నా వల్లే హైదరాబాద్‌కు మెట్రో, హెచ్ఐసీసీ టిడిపి వల్లే, నేను కొట్లాడా: చంద్రబాబు
Recommended Video

అమరావతి: హైదరాబాదులోని హెచ్ఐసీసీలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్, అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. ఆయన ఏపీ అసెంబ్లీలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని కోసం నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతోంది. ఈ రెండు కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు.

నా వల్లే హైదరాబాదుకు మెట్రో వచ్చింది
హైదరాబాదుకు మెట్రో రైలు తన వల్లే వచ్చిందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర ఏమాత్రం పోయేది కాదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మెట్రో కోసం పోరాడానని తెలిపారు.

వైయస్ వల్లే ఆలస్యం అయింది
బెంగళూరు, అహ్మదాబాదుల జాబితాలో హైదరాబాదు కూడా ఉండాలని చెప్పానని చంద్రబాబు తెలిపారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే హైదరాబాద్ మెట్రో ఆలస్యం అయిందని చెప్పారు. లేదంటే అది ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండెనని ఆయన అభిప్రాయపడ్డారు.

అవన్నీ టీడీపీ హయాంలోనివే
ప్రస్తుతం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ జరుగుతున్న హెచ్ఐసీసీ, అలాగే శంషాబాద్ విమానాశ్రయం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివేనని చంద్రబాబు గుర్తు చేశారు. తనకు హైదరాబాదును అభివృద్ధి చేశానన్న సంతృప్తి ఉందని, అది చాలని చెప్పారు.

తెలుగు భాష పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
తెలుగుదేశం పార్టీ పేరులోనే తెలుగు ఉందని, తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు అంతకుముందు అసెంబ్లీలో అన్నారు. తెలుగు భాష పరిరక్షణకై తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications