కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జమ్మలమడుగు: ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిరేనా?

జమ్మల మడుగు నియోజకవర్గంలో మాజీమంత్రి పి. రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి ల మధ్య సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: జమ్మల మడుగు నియోజకవర్గంలో మాజీమంత్రి పి. రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి ల మధ్య సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు.ఇదే విషయమై రామసుబ్బారెడ్డి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రామసుబ్బారెడ్డితో చర్చించారు.అయితే బాబు బుజ్జగింపుల తర్వాత రామసుబ్బారెడ్డి వైఖరిలో మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తంచేస్తున్నారు.

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఏళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి తండ్రుల నుండి ఈ ఫ్యాక్షన్ గొడవలు సాగుతున్నాయి.

అయితే ఇటీవల కాలంలో ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరడంతో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి వర్గీయులకు మింగుడుపడడం లేదు. పార్టీలో ఆదిని చేర్చుకోవడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు ఆయనకు మంత్రిపదవినిక కట్టబెట్టడంపై కూడ రామసుబ్బారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

<strong>ఆది ఎఫెక్ట్: రామసుబ్బారెడ్డి అసంతృప్తికి కారణమిదే, త్వరలోనే ఎమ్మెల్సీ పదవి</strong>ఆది ఎఫెక్ట్: రామసుబ్బారెడ్డి అసంతృప్తికి కారణమిదే, త్వరలోనే ఎమ్మెల్సీ పదవి

అయితే పార్టీలో ప్రాధాన్యత తగ్గదని చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. కానీ , ఆచరణలో మాత్రం అందుకు విరుద్దంగా సాగుతోందని రామసుబ్బారెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. ఈ విషయమై రెండు రోజులపాటు బాబుతో రామసుబ్బారెడ్డి చర్చలు జరిపారు.

ఆది వల్లే అన్యాయం

ఆది వల్లే అన్యాయం

మొదటి నుండి పార్టీలో ఉంటున్న తనతో పాటు తన వర్గీయులకు ఆదినారాయణ రెడ్డి వ్యవహరశైలి వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతోందిన మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.పార్టీనే నమ్ముకొన్న క్యాడర్ కు న్యాయం జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని ఆయన బాబు వద్ద ప్రస్తావించారు. తన వర్గం కార్యకర్తలకే ఆదినారాయణరెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన బాబువద్ద ప్రస్తావించారు.పైకి చెప్పేదోకటి చేసోదొక రకంగా ఉందని రామసుబ్బారెడ్డి బాబుకు వివరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పథకాల్లో, పనుల్లో ప్రాధాన్యత లేదు

పథకాల్లో, పనుల్లో ప్రాధాన్యత లేదు

ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామసుబ్బారెడ్డి బాబుకు ఫిర్యాదుచేశారు. తన వర్గానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఆయన పదే పదే బాబు వద్ద జరిగిన సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. ఇటీవల నియోజకవర్గంలో 25 కోట్ల పనులు మంజూరయ్యాయి.అయితే ఈ పనులన్నీ ఆదినారాయణరెడ్డి వర్గీయులే పనులను చేశారని రామసుబ్బారెడ్డి బాబుకు ఫిర్యాదుచేశారని సమాచారం. ఉపాధి హామీ పనుల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.

మహనాడుకు గైరాజర్, ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు

మహనాడుకు గైరాజర్, ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు

మహానాడుకు మాజీ మంత్రి పి. రామసుబ్బారె్డ్డి గైరాజరయ్యారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వైఖరి కారణంగానే అసంతృప్తికి గురైన రామసుబ్బారెడ్డి విశాఖలో జరిగిన మహనాడుకు గైరాజరయ్యారు. అయితే అతను పార్టీకి దూరమౌతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, తాను టిడిపిలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. మహనాడుకు దూరంగా ఉన్నారు. అయితే రామసుబ్బారెడ్డి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యతపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయాలను బాబు వద్ద ప్రస్తావించారు.

బాబు ఏం చేస్తారు?

బాబు ఏం చేస్తారు?

రెండురోజులపాటు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చర్చించారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలను బాబుకు వివరించారు రామసుబ్బారెడ్డి. అయితే బాబు ఈ విషయమై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని టిడిపి పొలిట్ బ్యూరో లో నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు జరిగిన పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో కూడ ఈ విషయమై చర్చించారు. జమ్మలమడుగులో పట్టుకోసం నేతలు పట్టువిడుపులు లేకుండా ప్రయత్నిస్తే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో ఉంటాయోననే ఆభిప్రాయాలు కూడ లేకపోలేదు.

English summary
What is the decision taken Tdp chief Chandrababu naidu on Jammalamadugu issue. former minister P. Ramasubba reddy has met Chandrababu naidu on Sunday at Amaravati. he explained what is going on in Jammalamadugu assebly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X