అమరావతి ప్రమోషన్: బాబు మనవడు సైతం ట్విట్టర్‌లో, రేపు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ప్రమోట్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాను సాధనంగా ఎంచుకున్నారు. అంతేకాదు అమరావతికి ప్రపంచం స్థాయి గుర్తింపు తెచ్చేందుకు #ManaAmaravatiManaRajadhani అంటూ ఆయనే స్వయంగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ ప్రచారం ఇప్పుడు ట్విట్టర్‌లో హాట్ టాపిక్. చేతిలో ఉన్న పలకపై "మన అమరావతి-మన రాజధాని" అని రాసుండగా, దాన్ని చూపుతూ తీయించుకున్న చంద్రబాబు తన ఫోటోను ట్వట్టర్‌లో ఉంచారు.
Extend your support for #Amaravati. Take a selfie and hashtag it with #ManaAmaravatiManaRajadhani. pic.twitter.com/jozZk7ciNE
— N Chandrababu Naidu (@ncbn) October 20, 2015 ఆపై ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లు అదే దారిలో నడిచారు. అంతేకాదు, తన మనవడు కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతుండగా, ముందు పలకను ఉంచి తీసిన ఫోటోనూ ట్విట్టర్‌లో ఉంచారు.
Devaansh supporting #ManaAmaravatiManaRajadhani!! Are you? Take a pic and upload now!! pic.twitter.com/lokwEGeIFX
— Lokesh Nara (@naralokesh) October 21, 2015 అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా గురువారం అమరావతి ప్రాంగణంలో హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.












Click it and Unblock the Notifications