జగన్‌కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్: ఇంకో 50 రోజులే..
YSRCP Siddham: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనలను నిర్వహిస్తోన్నారు. జనంలోకి దూసుకెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఈ సభలో జగన్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రాభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సహా ఏ అంశంపైన అయినా చర్చకు తాము సిద్ధమేనని అన్నారు.

సామాజిక న్యాయానికి జగన్ నిలువునా శిలువ వేశారని చంద్రబాబు ఆరోపించారు. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేశారని మండిపడ్డారు. సిద్ధం బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మబోరని చంద్రబాబు అన్నారు.
జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చంద్రబాబు హెచ్చరించారు. ఇంకో 50 రోజులే మిగిలివుందని గుర్తు చేశారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ను విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ పడుతుందని జోస్యం చెప్పారు.
బూటకపు ప్రసంగాలు చేయడం కాదని, అభివృద్ధితో కూడుకున్న పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామని సవాల్ విసిరారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని అన్నారు. ప్లేస్, టైం, నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా, దేనిమీదైనా చర్చిస్తా నువ్వు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications