వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగళ్లులో చంద్రబాబు, బెంగళూరు టూర్ హాట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడి పిలుస్తోంది కార్యక్రమం పైన అందరిలో చైతన్యం రావాలన్నారు. వైద్యులు, ఇంజనీర్లు, ఐఏఎస్, రాజకీయ నేతలు కావాలని, కొందరు విద్యార్థులు లక్ష్యాలు నిర్ధేశించుకొని మరీ చదువుతున్నారని చంద్రబాబు కొనియాడారు.

పాఠశాలల్లో మరింత నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. పిల్లలకు సాంకేతిక విద్య పైన ఎక్కువ అవగాహన కల్పించాలని సూచించారు. మరుగుదొడ్ల ఆవశ్యకత పైన పిల్లలు అందరు వారి తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. రాయలసీమలో తాగు, సాగునీటి సమస్యలు ఉన్నాయని, క్రమపద్ధతిలో వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.

రాయలసీమలో ఎన్నో సమస్యలున్నాయని అన్నారు. సీమ కష్టాలను క్రమపద్ధతిలో పరిష్కరిస్తామన్నారు. బాలల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అంగళ్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వైద్యులు, ఇంజనీర్లు, ఐఏఎస్, రాజకీయ నేతలు కావాలని, కొందరు విద్యార్థులు లక్ష్యాలు నిర్ధేశించుకొని మరీ చదువుతున్నారని చంద్రబాబు కొనియాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అంగళ్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారిని ఎత్తుకున్న బాబు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతున్న దృశ్యం.

తుపాను బాధిత కుటుంబాలకు బాలకృష్ణ పరామర్శ

అరకులోయలో తుపాను బాధిత కుటుంబాలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం పరామర్శించారు. తుపాను సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాలయ్య హామీ ఇచ్చారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటపొలాలను సందర్శించారు.

ఇదిలా ఉండగా, చంద్రబాబు చతురతపై పారిశ్రామిక వర్గాలు అమితాసక్తి చూపుతున్నాయంటున్నారు. బెంగళూరులో చంద్రబాబు జరిపిన ఒక్కరోజు పర్యటన పారిశ్రామికవేత్తల చర్చల్లో ఏపీని హాట్‌టాపిక్‌గా మార్చేసిందని ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.

మంగళవారం బెంగళూరుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రభుత్వ పెద్దలతో కలవనప్పటికీ రోజంతా పారిశ్రామికవేత్తలతో గడిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, పారిశ్రామిక వర్గాల్లో అమితాసక్తిని రేకెత్తించాయి. మెరుగైన ప్రణాళికలు, పెట్టబడులతో వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తామని ప్రకటించిన చంద్రబాబు, అనుమతుల విషయంలో క్షణాల్లో నిర్ణయాలుంటాయన్నారు.

English summary
AP CM Chandrababu Naidu participates Badi Pilustondi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X