రష్యా అద్భుతం: డబ్బు లేదు కానీ నాది ఉక్కు సంకల్పం అన్న చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: సాంకేతిక పరిజ్ఞానంలో రష్యా ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. త‌న‌ ర‌ష్యా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింద‌ని, రష్యా పర్యటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం విజయవాడలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ దేశంలోని వనరులు రష్యాలో ఉన్నాయని చెప్పారు.

భారత్-రష్యాల మధ్య మంచి స్నేహబంధం ఉందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో రష్యా ముందు ఉందని చెప్పని ఆయన ఆంధ్రప్రేదశ్‌కు కూడా అలాంటి ఇమేజిని తీసుకురావాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ఏపీ గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.

Chandrababu Naidu Press Conference after Russia visit

ఈ స‌త్సంబంధాలు కేవ‌లం ఢిల్లీ, మాస్కోకే ప‌రిమితం కాదని ఆయ‌న చెప్పారు. ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య సారూప్య‌త ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌న దేశం విస్తీర్ణ‌త ర‌ష్యాక‌న్నా ఎంతో త‌క్కువ‌ని, జ‌నాభా సంఖ్య‌ మన క‌న్నా ర‌ష్యాకి ఎంతో తక్కువ‌ని చంద్ర‌బాబు అన్నారు. భారత్ జనాభా 135 కోట్లు అయితే రష్యా జనాభా కేవలం 11 కోట్లేనని అన్నారు.

కొన్ని ప్రాంతాలకు వెళితే హైదరాబాద్‌ బాగుందని అంటారని, తనను చూస్తే హైదరాబాద్‌ గుర్తుకు వస్తుందని, ఎందుకంటే హైదరాబాద్‌ను ప్రమోట్‌ చేసింది తానేనని ఆయన అన్నారు. ఆ దేశం అవ‌లంబించిన పాల‌సీల‌తో రష్యా మంచి అభివృద్ధి సాధించింద‌ని చంద్రబాబు పేర్కొన్నారు. స‌మ‌ర్థ‌వంతమైన‌ నాయ‌కుల వ‌ల్లే ఆ దేశ ప్ర‌గ‌తి సాధ్య‌మ‌యింద‌ని చెప్పారు.

కొంత మంది తాను ఏ దేశానికి వెళితే అలాంటి రాజధానిని నిర్మిస్తాననే వ్యాఖ్యలు చేస్తున్నానని, అలాంటి వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఓ రాజధాని కట్టాలంటే మరో స్లమ్ సిటీ తయారవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తన దగ్గర డబ్బులేదు కానీ, ఉక్కు సంకల్పం ఉందని సీఎం చంద్రబాబు స్సష్టం చేశారు.

తమ ఉద్దేశం అది కాదని ఏపీ రాజధాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలపాలన్నదే తన ద్యేయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ర‌ష్యా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల‌ను గురించి వాటిని ఎదుర్కొని అధిగమించిన తీరును ఆయన వివరించారు. ర‌ష్యా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పుతిన్ గాడిలో పెట్టార‌ని ఆయ‌న అన్నారు. ర‌ష్యాకి ఉన్న‌ వ‌న‌రులు ప్ర‌పంచంలో ఏ దేశంలోనూ లేవని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రష్యా పర్యటనలో భాగంగా పలు సంస్ధలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు గాను స్టేట్ మెరైన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. దీంతో పాటు రాడార్ అనే కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు.

రష్యా పారిశ్రామిక వేత్తలు ఏపీకి వస్తున్నారని చెప్పారు. రష్యా ప్రధానిని ఏపీకి రమ్మని ఆహ్వానించానని ఆయన తెలిపారు. కజకిస్థాన్‌ను చూసి రమ్మని ప్రధాని మోడీ చెప్పారని, ఆయన సూచన మేరకు కజకిస్థాన్‌కు వెళ్లినట్లు ఆయన చెప్పారు. తక్కువ సమయంలో ఆస్తానను అనే నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణానికి నమూనా పరిశీలనకు, అనుభవాల స్వీకరణకు కజకిస్థాన్ రాజధాని అస్తానాను సందర్శించామని, మనకు, కజకిస్థాన్‌కు అనేక సారూప్యాలు కనిపించాయని చంద్రబాబు తెలిపారు. సోవియట్ యూనియన్ కుప్పకూలినప్పుడు అనివార్యంగా కజకిస్థాన్ ఒక దేశంగా ఏర్పడిందని అన్నారు.

రాజధాని లేకుండానే దేశంగా అవతరించిన కజకిస్థాన్ ఓ మూలన వున్న అల్మాటీని తాత్కాలికంగా రాజధానిగా చేసుకుందని, తరువాత ఎంతో శ్రమించి, అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఒక దృఢ దీక్షతో అద్భుతమైన రాజధాని అస్తానాను నిర్మించుకుందని చంద్రబాబు అన్నారు.

ఇందు కోసం కజకిస్థాన్‌లోని ఉద్యోగులు ఏడాది పాటు వేతనం తీసుకోకుండా పనిచేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ స్థాయి రాజధాని నిర్మాణం కోసమే విదేశాల్లో పర్యటించినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టును నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 ఎయిర్‌ పోర్టులు పరిశీలించానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh cheif minsiter Chandrababu Naidu Press Conference after Russia visit.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X