వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్‌షా కొడుకుపై అవినీతి ఆరోపణల సంగతేమిటి, కేసులు పెడతారా: బాబు సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రమైన విమర్శలు గుప్పించారు.ఏపీ ప్రభుత్వంపై, తనపై అవినీతి కేసులు పెట్టాలనే బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనయుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో బిజెపి నేతలను లక్ష్యంగా చేసుకొని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇటీవల కాలంలో బిజెపి నేతలు టిడిపిపై చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ఇటీవల కాలంలో బిజెపి నేతలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంపై బాబు ఘాటుగా స్పందించారు.

అమిత్‌షా కొడుకుపై అవినీతి ఆరోపణలకు సమాధానిమివ్వాలి

అమిత్‌షా కొడుకుపై అవినీతి ఆరోపణలకు సమాధానిమివ్వాలి

తనపై, ఏపీ ప్రభుత్వంపై ఇటీవల కాలంలో బిజెపి నేతలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు.తమపై ఇంతకాలం పాటు ఎందుకు అవినీతి గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తనయుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాబు ప్రశ్నించారు.కేంద్రం బెదిరింపులకు తలొగ్గేది లేదని చంద్రబాబునాయుడు ఘాటుగానే స్పందించారు. బిజెపి నేతల తీరును ఎండగట్టాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి దిగజారుడు రాజకీయం

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి దిగజారుడు రాజకీయం

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి దిగజారిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. యూపీలో ఒక్క సీటును గెలుచుకొనేందుకు ఏ రకంగా అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు. నీతులు చెప్పే బిజెపి నేతలు ఎందుకు ఈ విషయాన్్ని మర్చిపోతున్నారని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకుగాను బిజెపి నేతలు ఈడీ, సిబిఐ లను ఉపయోగించారని బాబు ఆరోపణలు చేశారు.ఏపీలో మూడో రాజ్యసభ సీటును కూడ తాము దక్కించుకొనే అవకాశం ఉందన్నారు. తమ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే విలువల కోసమే తాము మూడో అభ్యర్ధిని బరిలోకి దింపలేదన్నారు చంద్రబాబునాయుడు.

 రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు

రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు

రాజకీయంగా లబ్దిపొందేందుకు బిజెపి నేతలు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపణలు చేశారు. కేంద్రం బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదన్నారు.అమిత్‌షా కొడుకుపై వచ్చిన ఆరోపణలను బాబు ప్రస్తావించారు. రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రత్యర్ధులను భయపడుతున్నారని బాబు అభిప్రాయపడ్డారు.

 బిజెపి వైపు ఉంటారా ప్రజల వైపు ఉంటారా

బిజెపి వైపు ఉంటారా ప్రజల వైపు ఉంటారా

ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ప్రజలవైపు ఉంటారా, లేదా బిజెపి వైపు ఉంటారో తేల్చుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తోనే తాము ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. బిజెపి అనుసరిస్తున్న విధానాలపై ప్రజలను మరింత చైతన్యవంతుల్ని చేయాలని బాబు పార్టీ నేతలను కోరారు.

English summary
Ap chief minister Chandrababunaidu responded on Bjp leaders corruption allegations. AP CM Chandrababu Naidu questioned to Bjp leaders over the allegations against Amit Shah's son.He conducted teleconference with party leaders on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X