అవిశ్వాసమా.. పోయేదేం లేదు: జగన్‌కు బాబు కౌంటర్, సాక్షి పత్రికపై..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు గురువారం స్పందించారు. అవిశ్వాసం పెడితే పోయేదేమీ లేదని అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ రేపటికి (శుక్రవారం) వాయిదా పడిన అనంతరం చంద్రబాబు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన సవాల్‌ను జగన్ స్వీకరించకపోవడం పిరికతనమో, పారిపోవడమే ఆయనకే వదిలేస్తున్నామన్నారు.

పత్తిపాటి కుటుంబం ఆస్తులు కొన్నదని జగన్ ఆరోపణ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ విషయమై జ్యూడిషఇయల్ విచారణ జరుపుతున్నామని చెప్పారు. జగన్ చెప్పిన జ్యూడిషియల్ విచారణకు సిద్ధమన్నా వెళ్లిపోయారన్నారు.

Chandrababu Naidu responds on YS Jagan No Confidence motion comments

స్పీకర్‌ను బయట అవమానిస్తే సభలో చర్చించవచ్చునని చెప్పారు. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినా ఒరిగేదేమీ లేదని చెప్పారు.

సాక్షి మీడియా అటాచ్‌లో ఉంది

అక్రమంగా సంపాదించిన డబ్బుతో జగన్ సాక్షి మీడియాను పెట్టారని చంద్రబాబు విమర్శించారు. సాక్షి అటాచ్‌మెంటులో ఉందని తెలిపారు.

తన వ్యాఖ్యలపై స్పీకర్ కోడెల వివరణ ఇచ్చిన తర్వాత ఇతర ఏ మీడియా కూడా మళ్లీ మళ్లీ ప్రసారం చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. సాక్షి మాత్రం పదేపదే దానిని ప్రసారం చేసి స్పీకర్‌ను అవమానించిందన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. న్యాయం చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. కాగా, అగ్రిగోల్డ్ నిందితులను పట్టించిన వారికి రూ.25 లక్షలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Nara Chandrababu Naidu on Thursday said that there is no use, if YSRCP will move No-Confidence motion against Speaker Kodela siva Prasad Rao.
Please Wait while comments are loading...