ఎవరాయన: దిగ్విజయ్‌పై దుమ్మెత్తిపోసిన బాబు

హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు చెప్పాల్సిన విషయాలు చెప్పడానికి దిగ్విజయ్ సింగ్ ఎవరని ఆయన అడిగారు. విభజన బిల్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని, దిగ్విజయ్ సింగ్ ఓ పార్టీ వ్యక్తి అని, అలా చెప్పడానికి వీలు లేదని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలో దిగ్విజయ్ సింగ్ ఎలా చెబుతారని, బిఎసిని ప్రభావితం చేసే విధంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, తెలివినంతా ఆంధ్రప్రదేశ్‌పై ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు శాసనసభలో తీర్మానం పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్రాధికారాలను తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదని ఆయన అన్నారు.

 Chandrababu Naidu

గవర్నర్ పదవిని కాంగ్రెసు దుర్వినియోగం చేస్తోందని, రామ్‌లాల్ ఉదంతాన్ని కాంగ్రెసు ఓసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌తో, లాలూచీతో, అధికార దాహంతో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. బిల్లును చూడకుండా అబద్ధాలు చెప్పే పరిస్థితికి దిగ్విజయ్ సింగ్ వచ్చారని ఆయన దుమ్మెత్తిపోశారు. దేశంలో ఎప్పుడూ ఇలాంటి విభజన చూడలేదని ఆయన అన్నారు. ఆర్టికల్ 3ని ఎప్పుడు ఆచరణలో పెట్టారని ఓసారి చూడాలని ఆయన అన్నారు. ప్రొవిన్స్ ఉన్న కాలంలో దాన్ని అమలు చేశారని ఆయన అన్నారు.

ప్రజలకు ఏం కావాలో అదే తాను అడుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక విమానంలో విభజన ముసాయిదా బిల్లును తేవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుంటే ఏకాభిప్రాయం అవుతుందా అని అడిగారు. నాలుగైదు సీట్ల కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.

హైదరాబాద్ అత్యంత సున్నితమైన అంశమని, ఈ స్థితిలో ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమతో కలుస్తాడని, వైయస్ జగన్ డిఎన్ఎన్ తమ డిఎన్ఎనే అని దిగ్విజయ్ సింగ్ మరోసారి చెప్పారని, దాన్ని బట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తాము చెబుతున్న విషయంలో వాస్తవం ఉన్నట్లు రుజువైందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు.

రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని గుర్తు చేస్తూ ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా అని అడిగారు. ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని ఆయన అడిగారు. హైదరాబాద్‌పై అధికారాలు గవర్నర్‌కు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ కావాలని ఆయన అన్నారు. 371డి సవరణ జరగాలని అటార్నీ జనరల్ చెప్పినా కేంద్రానికి పట్టడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+