హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2వేల కి.మీ. రోడ్డు, టెక్నాలజీ: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2 వేల కిలోమీటర్లు పొడవున రహదార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంపై ఆర్ధికభారం పడకుండా వీటన్నింటినీ పీపీపీ-బిఓటి పద్ధతిలో నిర్మించాలని భావిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక రోడ్లు అసంపూర్తి నిర్మాణంతో ఉన్నట్టు గుర్తించారు.

వాటన్నింటినీ వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త రోడ్లకు ప్రతిపాదనలు చేయాలని ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు దేశంలో రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్లకు, విస్తరణకు రూ.50 వేల కోట్లు ఇవ్వబోతోందని, ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నాలుగు లైన్లుగా ఉన్న రోడ్లను ఐదు లైన్లకు విస్తరించేలా ప్రణాళికలు వేయాలన్నారు.

పది నెలల్లో విశాఖపట్నం-భీమునిపట్నం రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో భారతనౌకాదళం విశాఖపట్టణంలో అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించబోతోందని, అందుకు అనుగుణంగా రహదారి నిర్మాణం జరగాలని అన్నారు. తిరుపతి, కాకినాడ, విశాఖపట్టణంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక వాడలను అనుసంథానం చేస్తూ రహదారులను నిర్మించాల్సి ఉందని చెప్పారు.

రహదారి మార్గంలో సాధ్యమైనంత వరకూ వంపులు లేకుండా శాస్ర్తీయ పద్ధతుల్లో నిర్మాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని చక్కటి రహదారులు నిర్మాణం జరిగేలా చూడాలన్నారు.జలాశయాలు ఉంటే అక్కడ ఫ్లై ఓవర్లునిర్మించాలన్నారు. కేంద్రం రహదారుల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు వ్యయంచేస్తోందని, అందులో రాష్ట్రానికి భారీ కేటాయింపులు జరిగేలా ప్రణాళికలు అంచనాలు పంపించాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు కర్నూలు డీసీసీబీ చైర్మన్‌తో భేటీ అయిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు కూచిపూడి గ్రామస్థులతో భేటీ అయిన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాత్రి లయన్ ఆడియో వేడుకలకు హాజరైన దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాత్రి లయన్ ఆడియో వేడుకలకు హాజరైన దృశ్యం.

English summary
AP CM chandrababu naidu review on roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X