చంద్రబాబుకు ఝలక్: ఎవరీ ఐవైఆర్ కృష్ణారావు?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరికోరి తీసుకొన్న ఐవైఆర్ కృష్ణారావు చివరకు ఆయనకే ఝలక్ ఇచ్చారు. ఐవైఆర్ కృష్ణారావు తీరుతో టిడిపి కార్యకర్తలు బాబుకు ఫిర్యాదు చేయడంతో ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ పదవి నుండి తొలగించారు. అయితే ఐఎఎస్ అధికారిగా ఉద్యోగ విరమణ చేసిన కృష్ణారావు చేసిన విమర్శలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి.

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు చేసిన విమర్శలపై ఏపీ ప్రభుత్వం కూడ ఎదురుదాడికి దిగింది. ఆయన స్థాయికి తగ్గట్టుగా కృష్ణారావు వ్యవహరించలేదని ప్రభుత్వం ఆరోపణలు చేసింది.

కొంతకాలంగా ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వం చేస్తున్న పనులపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ విమర్శలు అధికారపార్టీలో కలవరపాటుకు గురిచేశాయి.

ఈ విషయమై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి నుండి ఐవైఆర్ కృష్ణారావును తొలగించారు. అయితే కృష్ణారావు మధ్యాహ్నం మూడుగంటలకు మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయనను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎవరీ కృష్ణారావు?

ఎవరీ కృష్ణారావు?

1979 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. పలు కీలకమైన శాఖల్లో కూడ పనిచేశారు. 1979 లో ఆయన ఐఎఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆయన కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శిగా, ఫైనాన్స్ సెక్రటరీగా కూడ పనిచేశారు. టిటిడి ఈవోగా, సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ గా కూడ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా

ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా

2014 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు తనతో పనిచేసే అధికారుల టీమ్ లో ఐవైఆర్ కృష్ణారావుకు పెద్దపీట వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలను కట్టబెట్టారు. చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చిననాటి నుండి 2016 వరకు బాబు ఆయనను పదవిలో ఉంచారు. పూర్తికాలం పాటు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.

బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి

బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఐవైఆర్ కృష్ణారావు 2016 లో రిటైరయ్యారు. అయితే కృష్ణారావు సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ విషయమై బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని ఇవ్వాలని బాబును అడిగినట్టుగా కృష్ణారావు ప్రకటించారు. అయితే బాబు కూడ ఈ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని కృష్ణారావుకు కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్పోరేషన్ ఏర్పాటుచేసే నాటికి తెలంగాణలో బ్రహ్మణుల కోసం ఆ ప్రభుత్వం చేపట్టిన విధానాలను కృష్ణారావు కొనియాడారు.

ఏం జరిగింది ?

ఏం జరిగింది ?

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులను షేర్ చేయడం వంటి పరిణామాలతో టిడిపి కార్యకర్తలు ఐవైఆర్ పై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగానే కాదు, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కూడ ఆయన కొన్ని పోస్టులను షేర్ చేసినట్టు టిడిపి కార్యకర్తలు అంటున్నారు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ వైరల్ కావడం కూడ టిడిపి శ్రేణులను తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో వారంతా బాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఐవైఆర్ ను తప్పించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a major decision that may turn uncomfortable for him later, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu ousted retired IAS officer IYR Krishna Rao as chairman of the Andhra Pradesh Brahmin Welfare Corporation. Naidu had been angry with Rao for the last couple of months for posting and sharing comments criticising the government on social media.
Please Wait while comments are loading...