'జగన్ నంద్యాల టూర్ అడ్డుకోవాలని రహస్యంగా చంద్రబాబు ఆదేశాలు'

తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహస్యంగా పిలుపునిచ్చారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఆరోపించారు.

నంద్యాల: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహస్యంగా పిలుపునిచ్చారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఆరోపించారు.

భయపడేది లేదు

భయపడేది లేదు

తమ పార్టీ అధినేత జగన్‌కు వస్తున్న ప్రజాధరణను అధికార టిడిపి ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. అందుకే తమ అధినేత పర్యటనను అడ్డుకోవాలని రహస్యంగా పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు ఏం చేసినా తాము భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.

11 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు తిష్ట

11 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు తిష్ట

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 11 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేశారని చెప్పారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో జనం విసిగిపోయారన్నారు.

భయంతోనే

భయంతోనే

ఉప ఎన్నికల్లో వైసిపిని గెలిపించే అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని భూమన అన్నారు. వైసిపి గెలుస్తుందనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలకు వచ్చారని చెప్పారు.

ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణ

ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణ

కాగా, జగన్ బహిరంగ సభను అడ్డుకునేందుకు టిడిపి నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. బహిరంగ సభకు వెళ్లకుండా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+