విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉన్నతవిద్యా పథకానికి తన పేరు పెట్టడంపై చంద్రబాబు సీరియస్: తప్పులేదన్న మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ శాఖల అధికారులు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రబాబుకు చెప్పాపెట్టకుండానే తమ శాఖలోని పథకాలకు 'చంద్రన్న' పేరు తగలించేస్తున్నారు. తాజాగా ఉన్నత విద్యా పథకానికి తన పేరు పెట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

తన ఆమోదం తీసుకోకుండా... తనకు తెలియకుండా ఈ పేరు తగిలించడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎంఓ అధికారులతో ఈ విషయమై ఆదివారం ఆయన మాట్లాడారు. సీఎం కార్యాలయానికి తెలియకుండా ఎవరికి వారు ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టడమేంటని ప్రశ్నించినట్టు సమాచారం.

దీంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇకపై పథకాలకు పేర్లు పెట్టే ముందు సీఎం కార్యాలయం అనుమతి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే పథకాలకు ఎన్టీఆర్ వంటి నేతల పేర్లు పెట్టుకోవచ్చని, దాన్ని ప్రజలు కూడా హర్షిస్తారని పేర్కొన్నారు.

 Chandrababu Naidu series on his name using for schemes

కాపు పథకాలకు చంద్రబాబు పేరు

కాపుల సంక్షేమానికి ఎంతో పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరును ఆయా పథకాలకు పెట్టడంలో తప్పులేదని మంత్రి నారాయణ అన్నారు. ఈ విషయమై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,000 కోట్లు ఇచ్చారని, ఇంత వరకు ఆ స్థాయిలో నిధులు ఎవరూ ఇవ్వలేదన్నారు.

ఈ నిధులతో కాపుల ఆర్థిక వృద్ధి ఎన్నో రెట్లు మెరుగుపడుతుందన్నారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కమిషన్ ను కూడా వేశారని, ఆ పని నడుస్తోందన్నారు. గతంలో ఎవరూ ఈ స్థాయిలో చేయలేదు కాబట్టి కాపుల సంక్షేమానికి సంబంధించిన పథకాలకు ఆయన పేరు పెట్టాలని కాపు నేతల అభిప్రాయంగా చెప్పారన్నారు.

గతంలో కాంగ్రెస్ పాలనలో పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టుకున్న సందర్భాలను గుర్తు చేశారు. అలాగే, తమిళనాడులో ప్రభుత్వ పథకాలకు అమ్మ (జయలలిత) పేర్లు పెడుతుండగా... ఇక్కడి పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. అయితే, పేర్లు పెట్టేముందు పద్ధతి ప్రకారం తన అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారన్నారు.

కాగా, వెలగపూడిలో నిర్మితమవుతున్న సచివాలయంలోకి జూన్ 27న తప్పనిసరిగా వెళతామని మంత్రి పునరుద్ఘాటించారు. ఆ రోజు మంచి రోజు కావడంతో ముందుగానే ఈ తేదీని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి వచ్చాక పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆర్అండ్ బీ, హెచ్ఆర్, ఇరిగేషన్ విభాగాల వారు సొంతంగా ఆఫీసులను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు.

English summary
Chandrababu Naidu serious on his name using for schemes .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X