మనపై 41 శాతం మందికి అసంతృప్తి: బాబు షాక్, జగన్ పార్టీ నేతకు లోకేష్ అభినందన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్ర ప్రజల సంతృప్తి స్థాయిని మరో ఇరవై శాతం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ కమిటీ భేటీలో మాట్లాడారు.

జగన్‌కు ఝలక్: టచ్‌లో ఎమ్మెల్యేలు, ఇప్పుడే చేరాలని ముగ్గురి ఉత్సాహం

41 శాతం మందిలో అసంతృప్తి

41 శాతం మందిలో అసంతృప్తి

ప్రస్తుతం ప్రజల్లో 59 శాతం సంతృప్తి ఉందని, అసంతృప్తిగా ఉన్నవారు ఇంకా 41 శాతం మంది ఉన్నారని చంద్రబాబు నేతల ఎదుట షాకింగ్ ప్రకటన చేశారు. అది మరో 20 శాతం తగ్గాలన్నారు. 80 శాతం ప్రజల్లో సంతృప్తి రావాలని చెప్పారు.

దానిని బెంచ్ మార్క్‌గా తీసుకొని

దానిని బెంచ్ మార్క్‌గా తీసుకొని

నంద్యాల, కాకినాడల్లో ప్రతిపక్షంపై టిడిపి 16 శాతం ఆధిక్యం సాధించిందని, దాన్ని బెంచ్‌ మార్క్‌గా తీసుకుని అక్కడి నుంచి ఇంకా పైకి పెరగాలి తప్ప కిందకు దిగకూడదని చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో సంతృప్తిని మరో ఇరవై శాతం పెంచడంలోనే మన సామర్థ్యం బయటకు వస్తుందన్నారు.

పథకాల లబ్ధి

పథకాల లబ్ధి

పథకాల లబ్ధిని పేదలకు అందించడంలో రాజకీయాలు చూడొద్దని చంద్రబాబు సూచించారు. ఇంటింటికీ టిడిపిలో భాగంగా అన్ని జిల్లాల్లో తానూ పర్యటిస్తానని, ఉదయం మూడు గంటల పాటు గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామస్ధులతో మాట్లాడతానని తెలిపారు మధ్యాహ్నం డ్వాక్రా మహిళలతో సమావేశం అవుతానని, సాయంత్రం ఆరు గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశ మై సమన్వయం, పార్టీ అంతర్గత వ్యవహారలపై మాట్లాడతానని తెలిపారు. ఇదే షెడ్యూల్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అనుసరించాలన్నారు.

వైసిపి సర్పంచ్‌తో లోకేష్ ఇలా..

వైసిపి సర్పంచ్‌తో లోకేష్ ఇలా..

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడున్న పార్టీలన్నీ ఒక్కటై పని చేసుకోవాలని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఆయన విజయనగరం జిల్లా కొత్త వలసలో పర్యటించారు. స్థానిక రాజన్న కాలనీలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలిచారు. ఈ క్రమంలో పంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ సర్పంచ్‌ గొరపల్లి అలేఖ్య వినతి పత్రం ఇచ్చారు.

లోకేష్ ఆశ్చర్యం

లోకేష్ ఆశ్చర్యం

ఈమె వైసిపికి చెందిన వారని తెలుసుకున్న లోకేష్‌ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతవరకు నేను ఎనిమిది జిల్లాల్లో పర్యటించానని, ప్రతిపక్షానికి చెందినవారు అభివృద్ధి కోసం ఇలా ఎవరూ నన్ను కలవలేదన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కలిసి పని చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అలేఖ్యను లోకేష్‌ అభినందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu shocking comments with Telugu Desam Party leaders in Tuesday meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి