'కనీసం ఈ రోజు ఇచ్చిన మాటనైనా చంద్రబాబు నిలబెట్టుకోవాలి'
దరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ శాసన సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు ఇచ్చిన మాటనైనా నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబు పాలనలో హంద్రీనీవాకు రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. ఇది వాస్తవం కాదా చెప్పాలన్నారు. వైయస్ హయాంలో హంద్రీనీవా పనులు వేగవంతంగా జరిగాయని చెప్పారు. హంద్రీనీవా కాలయాపనకు చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు.

రాయలసీమ ప్రజలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారన్నారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సింగపూర్, జపాన్ వంటి వాటిని పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచించాలన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలన్నారు. చంద్రబాబు రైతుల చెవుల్లో పూవులు పెట్టవద్దన్నారు.
ముస్సోరికి చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ముస్సోరి వెళ్లనున్నారు. అక్కడి లాల్ బహదూర్ శాస్ర్తి అకాడమీలో ట్రైనీ ఐఏఎస్‌లను ఉద్దేశించి సీఎం బాబు ప్రసంగించనున్నారు. బ్యూరోక్రసీ, పాలసీ మేకింగ్‌పై చంద్రబాబు ఉపన్యసిస్తారు. అనంతరం ఢిల్లీలో జరిగే టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో బాబు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications